రెబ్బెన ; సింగరేణి ఇసుక ప్లాంటేషన్ కోసం గోలేటి శివారులో సింగరేణి సర్వే డిపార్ట్ మెంట్ అధికారులు బుధవారం సర్వేకు వచ్చారు. సర్వేను సంబంధిత పట్టాదారు రైతులు వసంత, మధుకర్ గౌడ్, సుజాత తదితరులు సింగరేణి అధికారులను అడ్డుకున్నారు. 24 ఎకరాలు సింగరేణికి అవసరం కాగా 19 ఎకరాలకు మాత్రమే రైతులకు నష్టపరిహారం చెల్లించారని, మిగితా ఐదు ఎకరాలకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదని సంబంధిత రైతులు అన్నారు. బుధవారం రైతులకు సమాచారం అందించకుండా అధికారులు సర్వే చేపట్టడంతో సర్వేను అడ్డుకున్నారు. న్యాయం జరిగే వరకు భూసేకరణ సర్వే నిలిపివేసి పట్టాదారు రైతులకు న్యాయం చేకూర్చాలని అన్నారు
No comments:
Post a Comment