Monday, 31 August 2015

మండలానికి 108 వాహనాన్ని కేటాయించాలి

మండలానికి 108 వాహనాన్ని కేటాయించాలి



రెబ్బెన మండల కేంద్రానికి 108 అంబులెన్సు వాహనం లేక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారని జెఎసి కన్వీనర్ మోడెమ్ సుదర్శన్ గౌడ్ రెబెన తహశిల్దార్ రమేష్ గౌడ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ గతంలో మండల కేంద్రానికి 108 వాహనం కేటాయించిన దానిని కొన్ని కారణాల వలన తాండూర్ కు తరలించారని దీంతో రెబ్బెన మండల కేంద్రంలో 108 అంబులెన్సు లేక ఇబ్బందులు పడుతున్నారని,  విషజ్వరాలు వ్యాపించే వర్షాకాలంలో అంబులెన్సు లేక ప్రైవేటు అంబులెన్సులను ఆశ్రయిస్తున్నారని, గతంలో ఈ విషయం గురించి ఎమెల్యే కోవా లక్ష్మికి తెలుపగా చర్యలు తీసుకుంటానని అన్నారు, ఆదివారం నాడు రెబ్బెనలో రైల్వే స్టేషన్లో ప్రమాదం జరిగిన రెండు గంటల తరువాత అంబులెన్సు వచ్చిందని దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిందని అన్నారు. ఈ కార్యాక్రమంలో ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, తెరాస తూర్పు జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ జైశ్వాల్, తెరాస రెబ్బెన టౌన్ ప్రెసిడెంట్ రాపర్తి అశోక్, మోడెమ్ రాజేంద్రప్రసాద్,  ఎఅయ్ఎస్ఆఫ్ డివిజన్ అధ్యక్షుడు గోగర్ల రాజేష్ , జహురోద్ధిన్, ముంజం వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment