Saturday, 8 August 2015

ప్రభుత్వం జీపీ కార్మికుల సమస్యలను గుర్తించాలి


రెబ్బెన రూరల్‌ : గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సొల్లు లక్ష్మీ అన్నారు. మండల కేంద్రంలో చేపట్టిన గ్రామ పంచాయతీ కార్మికుల దీక్షకు ఆమె సంఘీబావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్న కార్మికుల వేతనాలను పెంచి వారిని గుర్తించాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సుదర్శన్‌ గౌడ్‌, నర్సింహులు, మోడం రాజాగౌడ్‌, సీఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగవెల్లి సుధాకర్‌, ప్రకాష్‌, ఎల్‌ సోమశేఖర్‌, బిక్కు, విఠల్‌ సంతోష్‌ బాబాజీ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment