రెబ్బెన మండలంలోని 12 గ్రామపంచాయతీల పరిధిలో ఆయా గ్రామాల గ్రామపంచాయతీ కార్యాలయాల్లో గ్రామసర్పంచ్ ల ఆధ్వర్యంలో గ్రామజ్యోతి కార్యక్రమం ను నిర్వహించారు. ఈసందర్భంగా పాఠశాలల విద్యార్థుల చే ర్యాలీలు, మానవహారాలు నిర్వహించి గ్రామజ్యోతి పథకం గురించి వివరించడం జరిగింది. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో రెబ్బెన సర్పంచ్ పెసరి. వెంకటమ్మ గ్రామ పంచాయితి కార్యాలయం నుండి బి.సి. హాస్టల్ వరకు కాలువలకు ఇరువైపుల ఉన్న పిచ్చి మొక్కలను తీసివేసారు. నంబలలో సర్పంచ్ గజ్జెల సుశీల ఆధ్వర్యంలో రోడ్డుకి ఇరువైపులా ముండ్ల పొదలను నరికివేసారు. గోలేటిలో రమణారెడ్డి నగర్ మరియు దళితవాడలలో సర్పంచ్ తోట . లక్ష్మణ్ ఇంటింటా సమస్యలను అడిగి తెలుసుకొని పలు వాడలలో చేత్తను శుబ్ర పరచారు. ఖైరగామలో రెబ్బెన తహసిల్దార్ రమేష్ గౌడ్ రోడ్డు పక్కనున్న పిచ్చి మొక్కలను, మురికి కాలువల శుబ్రం చేసారు. మురికి కాలువలలో నుండి నీరు బావిలోకి కలుస్తుందని వాటిని నివారించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామజ్యోతి పథకం లో అందరూ భాగస్వామ్యం పంచుకోవాలని అలాంటప్పుడే గ్రామాలు అభివృద్ది దిశగా ప్రయానించి కేసీఆర్ లక్ష్యం నెరవేరుతుందని ఆయన అన్నారు. అనంతరం గ్రామ పంచాయతీలో గ్రామ అభివృద్దికి సంబంధించిన కమిటీ మెంబెర్లు, కార్యక్రమంలో ఆయా గ్రామాల ఎంపీటీసీలు, ఉపసర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఏఎన్‌ఎంలు, సాక్షరభారతీ కోఆర్డినేటర్లు, కార్యదర్శులు, కారోబార్లు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Tuesday, 18 August 2015
12 గ్రామపంచాయతీలలో గ్రామజ్యోతి
రెబ్బెన మండలంలోని 12 గ్రామపంచాయతీల పరిధిలో ఆయా గ్రామాల గ్రామపంచాయతీ కార్యాలయాల్లో గ్రామసర్పంచ్ ల ఆధ్వర్యంలో గ్రామజ్యోతి కార్యక్రమం ను నిర్వహించారు. ఈసందర్భంగా పాఠశాలల విద్యార్థుల చే ర్యాలీలు, మానవహారాలు నిర్వహించి గ్రామజ్యోతి పథకం గురించి వివరించడం జరిగింది. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో రెబ్బెన సర్పంచ్ పెసరి. వెంకటమ్మ గ్రామ పంచాయితి కార్యాలయం నుండి బి.సి. హాస్టల్ వరకు కాలువలకు ఇరువైపుల ఉన్న పిచ్చి మొక్కలను తీసివేసారు. నంబలలో సర్పంచ్ గజ్జెల సుశీల ఆధ్వర్యంలో రోడ్డుకి ఇరువైపులా ముండ్ల పొదలను నరికివేసారు. గోలేటిలో రమణారెడ్డి నగర్ మరియు దళితవాడలలో సర్పంచ్ తోట . లక్ష్మణ్ ఇంటింటా సమస్యలను అడిగి తెలుసుకొని పలు వాడలలో చేత్తను శుబ్ర పరచారు. ఖైరగామలో రెబ్బెన తహసిల్దార్ రమేష్ గౌడ్ రోడ్డు పక్కనున్న పిచ్చి మొక్కలను, మురికి కాలువల శుబ్రం చేసారు. మురికి కాలువలలో నుండి నీరు బావిలోకి కలుస్తుందని వాటిని నివారించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామజ్యోతి పథకం లో అందరూ భాగస్వామ్యం పంచుకోవాలని అలాంటప్పుడే గ్రామాలు అభివృద్ది దిశగా ప్రయానించి కేసీఆర్ లక్ష్యం నెరవేరుతుందని ఆయన అన్నారు. అనంతరం గ్రామ పంచాయతీలో గ్రామ అభివృద్దికి సంబంధించిన కమిటీ మెంబెర్లు, కార్యక్రమంలో ఆయా గ్రామాల ఎంపీటీసీలు, ఉపసర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఏఎన్‌ఎంలు, సాక్షరభారతీ కోఆర్డినేటర్లు, కార్యదర్శులు, కారోబార్లు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment