Tuesday, 4 August 2015

మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించిన ఎన్‌ఎస్‌యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శి


రెబ్బెన : మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎన్‌ఎస్‌యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం భరద్వాజ్‌ సోమవారం పరిశీలించారు. పిల్లలకు మెను ప్రకారం మధ్యాహ్నం అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. భోజన నాణ్యతను పరిశీలించి విద్యార్థులతో కలిసి బోజనం చేశారు. విద్యార్థులకు అందించే ఆహరంలో నాణ్యత ప్రయాణాలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ మైనార్టీ పట్టణ అధ్యక్షుడు అబ్బు, ముజ్జా, సాయివికాస్‌, వినయ్‌, సంజీవ్‌, హమీద్‌, రమేశ్‌, కిశోర్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment