రెబ్బెన : వట్టివాగు ప్రాజెక్టు కింద చివరి ఆయకట్టు కింద సాగు చేసుకుంటున్న రైతులకు సాగునీరు అందేలా చూడాలని మండల టీడీపీ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్ అన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ వట్టివాగు ప్రాజెక్టు కింద 2300ల ఎకరాలు సాగుభూమి ఉందని, చివరి ఆయకట్టు వరకు నీరు అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. నీరందకపోవడంతో వేసిన వరినాట్లు ఎండిపోయాయని దీంతో రైతులు బాదపడుతున్నారని పేర్కొన్నారు. వట్టివాగు కింద కాలువకు పైభాగంలో ఉన్న రైతులు నీటిని విచ్చల విడుగా విడుదల చేయడంతో చివరి ఆయకట్టు వరకు నీరుసరిగా అందకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు పర్యవేక్షించి వెంటనే నీరందేలా చూడాలని అన్నారు. ఈకార్యక్రమంలో రైతులు పాపయ్య, నారయణ, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment