నెలల నుండి అంధకారంలో గ్రామాలు
గత కొన్ని నెలల నుండి విద్యుత్ సరఫరా లేక గ్రామాలు అంధకారంతో మగ్గుతున్నాయని నంబాల ఎం,పీ,టీ ,సి కొవ్వూరి శ్రీనివాస్ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. రాత్రిపూట చిన్నపిల్లలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నామని. వర్షకాలం కావడం వల్ల మురికి కాలువులల్లో చెత్తాచెదారం పేరుకుపోయి దోమలు విఫరీతంగా ఉన్నాయని ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్ లేకపోవడం వల్ల ఇబ్బందులకు గురౌతున్నామని రెబ్బెన మండలంలోని నంబాల,కిష్టాపుర్, జక్కులపల్లి, నారాయణపుర్,గంగాపుర్,తుంగేడ,తక్కలపల్లీ గ్రామపంచాయితీల్లో విద్యుత్ సప్లై లేదని ప్రజలు ఆందోళ చెందుతున్నారని. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని, నంబాలలో సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని గ్రామప్రజలు,రైతులు కోరుతున్నారు. ఈ సమావేశంలో ముంజం రవీందర్ గంగాపూర్ సర్పంచ్, గాజుల రవీందర్ పీఏసీ చైర్మన్, టీ పోతిరెడ్డి కిష్టాపూర్, పాలగొని పర్వతాలు మాజీ సర్పంచ్, లెండుగురె గంటుమేర మాజీ సర్పంచ్, ఎరువోతుల సుమన్ నారాయణపూర్, పీ మల్లారెడ్డి మాజీ సర్పంచ్, పూదరి వెంకటేష్ నారాయణపూర్, భానుప్రసాద్ నంబాల మాజీ సర్పంచ్, అనిశెట్టి వెంకన్నగంగాపూర్, గ్రామప్రజలు,రైతులు తదీతరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment