Thursday, 6 August 2015

భవిత కేంద్రంలోని సమస్యలు పరిష్కరించాలి


రెబ్బెన : మండలంలోని గోలేటి గ్రామ పంచాయతీలో గల భవిత కేంద్రంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని గురువారం తహసీల్దార్‌కు ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దుర్గం రవీంధర్‌ వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిత కేంద్రంలో ఉన్న విద్యార్థులకు మంచినీరు, మరుగుదొడ్లు, విద్యుత్‌ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని, మధ్యాహ్న భోజనం సరిపోవడం లేదన్నారు. కావున ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని అన్నారు. వినతి పత్రం అందించిన వారిలో జిల్లా కౌన్సిల్‌ సభ్యులు కస్తూరి రవికుమార్‌, నాయకులు కోడూరి సాయి, కార్తీక్‌, సాయికృష్ణ, అంజయ్య, సాయికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment