Friday, 21 August 2015

నార్లాపూర్ నుండి కిష్టాపూర్ మట్టి రోడ్డు చినుకు పడితే చిత్తడే

నార్లాపూర్ నుండి కిష్టాపూర్ మట్టి రోడ్డు చినుకు పడితే చిత్తడే

రెబ్బెన మండలంలోని నార్లపూర్ నుండి కిష్టాపూర్ వెళ్ళే దారి తారు రోడ్డు మంజూరు కాగా కాంట్రాక్టర్ నిర్లక్షంతో పనులు వేగవంతం చేయకుండా మట్టి వేయడంతో వర్షం రావడంతో చిత్తడే చిత్తడి అయ్యి కాలినడకన వెళ్ళేటట్లు లేదు. రెండు రోజుల నుండి వర్షం రావడంతో సదరు కాంట్రాక్టర్ రోడ్డుపై మొరం వెయ్యడంతో ఆ రోడ్డుకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా ఉన్నాయి. కాంట్రాక్టర్ నిర్లక్షం తోనే ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రజలు అంటున్నారు. ఉదయం పూట చిన్న పిల్లలు పాటశాలలకు వెళ్ళే బస్సులు కూడా రావడానికి వీకు లేకుండా ఉంది. రోడ్డు ఇలా ఉండడంతో పిల్లల చదువులకు ఇబ్బంది కలుగుతుందని వాపోతున్నారు. వర్షాకాలం విషజ్వరాలు వస్తుండడంతో ఆసుపత్రికి వెళ్ళడానికి వీలు లేకపోవడంతో ప్రజలు అంటున్నారు. వెంటనే ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తారు రోడ్డు వేయించగలరని గ్రామంలోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


No comments:

Post a Comment