రెబ్బెన మండలం లోని పలు దేవాలయాల్లో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి పూజ కార్యక్రమలు కన్నుల పండువగా జరుపుకున్నారు. గోలేటిలోని శ్రీ కోదండ రామాలయంలో వరలక్ష్మి వ్రతం కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గున్నారు. ఈ వ్రతాన్ని చేపట్టడం వల్ల వారి కుటుంబాలలో సర్వ సుఖ సంతోషాలతో వెలసిల్లుతాయని వేద పండితులు అన్నారు. శ్రావణ మాసంలో వచ్చే ఈ వరలక్ష్మి పూజను నవ అమృత పానియాలతో మరియు పూలు పండ్లు ఆకు వక్క తంబులాలు ఇచ్చిపుచ్చుకోవడాలు ఆనవాయితీగా వస్తుంది ఈ విదంగా భారత దేశ సంప్రదాయాలకు ఆచారాలకు పెట్టింది పేరుగా మహిళామణులు వన్నేతేస్తున్నారు
No comments:
Post a Comment