Friday, 7 August 2015

గిరిజనుల సమస్యలపై స్పందించని సింగరేణి అధికారులు


రెబ్బెన : తిర్యాణి మండలం డోర్లి ఓపెన్‌ కాస్ట్‌ 1వద్ద ఉన్న చోపిడి దంతనపల్లి, ఉల్లిపేట గ్రామాలకు చెందిన గిరిజనులు రెబ్బెన మండలంలో శుక్రవారం డోర్లివెళ్లే ప్రదాన రహదారిపై బైటాయించి ధర్నా చేశారు. 2003లో తమను పునరావాస కేంద్రాలకు తరలించిన భూములకు పునవాసం కల్పించకపోవడంతో తాము రోడ్డుపై ధర్నాకు దిగామని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే తిర్యాని ఎస్సై సంఘటన స్థలానికి చేరుకుని గిరిజనులకు సర్దిచెప్పడంతో ధర్నాని విరమించారు.

No comments:

Post a Comment