Sunday, 30 August 2015

నీటి ట్యాంక్ ను శుభ్రం చేసిన పంచాయితి సిబ్బంది

నీటి ట్యాంక్ ను శుభ్రం చేసిన పంచాయితి సిబ్బంది



మంచినీరు రావాల్సిన మంచి నీటి ట్యాంక్ నుండి ఆదివారం నాడు ఉదయం కుళాయి తిప్పగా పురుగులు, క్రిమి కీటకాలు వచ్చాయని రెబ్బెన ప్రజలు ఆవేదన చెందడంతో డీపీవో పోచయ్య , ఎమ్మార్వో రమేష్ గౌడ్ ఆదేశాల మేరకు సర్పంచ్ పెసరు వెంకటమ్మ వెంటనే ఆ మంచి నీటి ట్యాంక్ ను శుభ్రం చేశారు. అనంతరం పంచాయితి కార్యదర్శి రవీందర్ మాట్లాడుతూ ఇటువంటి పరిస్థితి మళ్లీ పునరావృతం కాకుండా చూస్తామని,  క్లోరినేషన్ చేపట్టామని, ఉదయం మంచి నీళ్ళలో పురుగులు వచ్చిన కాలనీలోని పైపు లైను ను పరిశీలిస్తామని, ఇలాంటి సమస్యలు ఎవైన ఉంటె తమ దృష్టికి తీసుకు రావలసిందిగా తేలిపారు.ఈ కార్యాక్రమంలో ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, తెరాస తూర్పు జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ కుమార్ జైశ్వాల్, మండల యూత్ ప్రెసిడెంట్ వెంకట్రాజం, సింగిల్ విండో డైరెక్టర్ పెసరు మధనయ్య, రెబ్బెన గ్రామ ప్రజలకు పాల్గొన్నారు.

No comments:

Post a Comment