Tuesday, 18 August 2015

ఇండియా నెంబర్ వన్ యాప్ --జియో

వాట్సాప్‌కి పోటీగా జీయో విత్.. సరికొత్త యాప్

- రిలయన్స్ నుంచి సరికొత్త మొబైల్ యాప్
- ఆడియో, వీడియా షేరింగ్ ఆప్షన్
- న్యూస్ అప్‌డేట్స్ సైతం..ఆసక్తి చూపుతున్న యూత్
         

Whats App Vs jio chat

    డిజిటల్ ఇండియాలో భాగంగా రిలయెన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ ప్రవేశపెట్టిన  జియో చాట్ యాప్
ఇండియా నెంబర్ వన్ యాప్ గా  అభివృద్ధి చెందుతుంది. ఆధునిక  టేక్నోలోజి యుగంలో స్మార్ట్ ఫోన్స్ వచ్చాక ఎస్‌ఎంఎస్‌లు, ఈ మెయిల్స్ కె పరిమితం కాకుండా సోషల్ మీడియా మాధ్యమాలకు క్రేజ్ పెరిగింది. మార్కెట్‌లోకి రోజుకో మొబైల్ యాప్ వస్తోంది. టెక్స్ మెసేజ్‌లకే పరిమితమైన జనానికి ఆడియోలు, వీడియోలు సైతం షేర్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తునాయి. అలా.. వాట్సప్, వైబర్, వియ్‌చాట్, హైక్ వంటి యాప్స్ కోట్లాది మంది వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఇలాంటి వాటికి దీటుగా రిలయెన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్  సరికొత్తగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల ముందుకు జియో చాట్ తెచ్చింది.  

                ఆండ్రాయిడ్ మొబైల్స్ చాటింగ్ కోసం వినియోగిస్తున్న వాట్సప్, లైన్, వైబర్, హైక్ వంటి అప్లికేషన్స్ సరసన సరికొత్తగా  జియోచాట్ వచ్చి చేరడంతో వాట్సప్ మాదిరి ఉచితంగా  ఆత్మీయులతో సంభాషించే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇటీవలే రిలయెన్స్ విడుదల చేసిన ఈ మొబైల్ యాప్‌లో ఆడియో, వీడియో చాట్‌తో  పాటు గ్రూప్ చాటింగ్‌కి కూడా అవకాశం కల్పించడం విశేషం.
                  ఒకేసారి ఎక్కువమందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం వుంది
జియో-యాప్ ఎమోషన్స్, డూడెల్స్ పంపించుకోవచ్చు. వీడియో, లోకేషన్ కూడా షేర్ చేసుకునే అవకాశం ఉంది.
వాట్సప్‌తో పోల్చితే జియో అదనపు ఆప్షన్స్  మరియు  ఇది  మేడ్ ఇన్ ఇండియా ట్యాగ్ కలిగి ఉండడం వల్ల భారతీయ వినియోగదారులు ఎక్కువగా ఇప్పుడు జియో వైపు ఆసక్తి చూపుతున్నారు  ప్లేస్టోర్ నుంచి  ఇ  యాప్ ని సులబంగా మరియు  ఫ్రీ  డౌన్లోడ్ చేసుకోవచ్చు.



No comments:

Post a Comment