Sunday, 9 August 2015

ఆదివాసీలు ముద్దుబిడ్డ భీం కు టి.వి.వి ఘననివాళి

 

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని రెబ్బెన  మండల కేంద్రంలోని బి .సి . వసతి గృహమున తెలంగాణ విద్యార్ధి వేదిక అద్వర్యం లో  ఆదివాసీలు ముద్దుబిడ్డ కొమరంభీంకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టి.వి.వి. జిల్లా అద్యక్షుడు కడతల సాయి కొమరంభీం చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన  అనంతరం అయన మాట్లాడుతూ పాలక వర్గాలు ఆదివాసుల చట్టాలను అమలుచేయటంలో పూర్తిగా విఫలం అయిందని వారు పేర్కొన్నారు. టైగర్ జోన్ల పేరిట ఆదివాసులను అడవులనుండి వెళ్లగొట్టే కుట్రపన్నుతుంది అని అన్నారు. ఆదివాసుల పొడు భూములపై పట్టాలు ఇవ్వాలని 12 %  రిజర్వేషన్ ను అమలుచేయాలని డిమాండ్ చేసారు.  ఈ కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శి జె శివాజీ , రెబ్బెన పట్టణ కార్యదర్శి ఎస్ డి  సమీర్, మండల నాయకులు సందీప్, జమీర్, వినోద్, సంతోష్ మరియు వసతి గృహ విద్యార్థులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment