Monday, 30 April 2018

ప్రజా ఫిర్యాదుల అర్జీలపై   అధికారులు తక్షణమే స్పందించాలి



కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 30 ; ప్రజా ఫిర్యాదులలో వచ్చిన అర్జీలపై  సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్  అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజల నుండి దరఖాస్తులను సమావేశ మందిరంలో  స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ మండలాల నుండి వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి అర్జీదారులకు  న్యాయం చేయాలన్నారు వివిధ రకాల సమస్యలపై అర్జీలు యాభై ఆరు వచ్చాయన్నారు అందులో  గోలేటి చెందిన  నర్సయ్య  రెండేళ్ల నుండి పెన్షన్ రావట్లేదని ,  కాగజ్ నగర్ నుండి ప్రవీణ్ కుమార్  తనకు విద్యుత్ షాక్ తో చేయి  కోల్పోయానని నష్టపరిహారం ఇప్పించాలని,  దానాపూర్ గ్రామస్థులు కరెంట్ సౌకర్యం కల్పించాలని, రాజంపేటకు చెందిన మూర్తి తనకు స్థలం ఇప్పించమని, ఎల్లంపల్లి, పెంచికలపేట గ్రామస్తులు  తాగునీటి సౌకర్యం కల్పించాలని జనకాపూర్కు చెందిన సంగీత డబుల్ బెడ్ రూమ్ ఇంటి   కొరకు, జనకాపూర్కు చెందిన పుష్ప తనకు భూమి ఇచ్చారు కానీ స్థలం చూపించడం లేదని తదితర దరఖాస్తులను  పాలనాధికారి కి  సమర్పించారు ఈ సమావేశాల్లో సంయుక్త పాలనాధికారి బి అశోక్ కుమార్, డిఆర్ఓ కంద సురేష్, డిఆర్డిఎ పిడి వెంకటి, సిపిఓ కృష్ణయ్య మరియు  జిల్లా అధికారులు  పాల్గొన్నారు.

కార్మికులకు మజ్జిగ  మరియు  ఓఆర్ఎస్ పాకెట్స్ అందచేయాలి


 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 30 ; కాంట్రాక్ట్ కార్మికులకు పని వేళలు  మారుస్తూ ఎండవేడికి ఉపశమనం కోసం మజ్జిగ మరియు ఓఆర్ఎస్ ప్యాకెట్ల అందజేయాలని ఏఐటీయూసీ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల యూనియన్ ఉప  అధ్యక్షుడు బోగే ఉపేందర్ సోమవారం ఎస్వోటూ జీఎం శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రస్తుతం ఎండాకాలంలో ఎండతీవ్రత రోజురోజుకు పెరుగుతుండడంతో కార్మికులు పని చేయడానికి చాలా ఇబ్బంది అవుతుందని  వారి కోసం పనివేళలను మారుస్తూ మజ్జిగ ఓ ఆర్ ఎస్  ప్యాకెట్లు ఇవ్వాలని అన్నారు . ఈ కార్యక్రమంలో సాగర్ గౌడ్, రామ్ కుమార్, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

ఏప్రిల్ నెలలో బెల్లంపల్లి ఏరియా 92 శాతం బొగ్గు  ఉత్పత్తి


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 30 ; బెల్లంపల్లి ఏరియాలో ఏప్రిల్ నెలకు గాను తొంభై మూడు శాతం ఉత్పత్తిని సాధించినట్టు ఏరియా  ఇంచార్జి జనరల్ మేనేజర్ కొండయ్య తెలిపారు. సోమవారం రెబ్బెన మండలం    గోలేటి  జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల  సమావేశంలో అయన ఉత్పత్తి వివరాలను తెలిపారు.  ఏప్రిల్ నెలకు గాను. ఏరియాకు నిర్దేశించి నిన 6,10,000 టన్నుల బొగ్గు  ఉత్పత్తికి గాను,5,61,857 టన్నుల ఉత్పత్తి తో 92 శాతం సాధించినట్టు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సంస్థ 70మిలియన్ టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించుకోగా బెల్లంపల్లి ఏరియాకు 70లక్షల టన్నుల లక్ష్యాన్ని ఏర్పాటుచేసిందన్నారు. సంస్థ వార్షిక లక్ష్యంలో బెల్లంపల్లి ఏరియా 10 శాతం ఉత్పత్తిని సాధించాల్సి ఉంటుందన్నారు.ఏప్రిల్ నెలలో ఖైరిగూడ ఓసిపి 2,58,688 టన్నులు, బెల్లంపల్లి ఒసిపి 2 ఎక్స్టెన్షన్ 1,02,531 టన్నులు,డోర్లి -1ఓసిపి 2,00638,టన్నుల ఉత్పత్తి సాధించినట్లు పేర్కొన్నారు. గత సంవత్సరం ఏప్రిల్ తో పోలిస్తే ఈసారి రెండు శాతం ఉత్పత్తి తగ్గినట్లు తెలిపారు.అదేవిదంగా 17 శాతం బొగ్గు డిస్ ప్యాచ్లు తగ్గినట్లు తెలిపారు.ఏప్రిల్ నెలలో 190 ర్యాక్స్  బొగ్గును సరఫరా చేశామన్నారు. ఇటీవలే గోలేటి సి హెచ్ పి పూర్తి స్థాయి  ప్రారంభం కావడంతో  మరింత ఎక్కువ  బొగ్గు సరఫరా  సాధిస్తామన్నారు. వినియోగదారులకు 100 శాతం సరఫరా  లక్షంగా పని  చేస్తామన్నారు. ఉత్పత్తికి అవసరమైన యంత్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. గడిచిన నెలలో ఏర్పడిన ఉత్పత్తి లోటును వచ్చే నెలలో అధిగమిస్తామన్నారు. టెక్నీషన్లు, ఫిట్టర్లు కొరత కొంత ఇబ్బందులకు గురిచేస్తుంది అన్నారు. మే  నెలకు గాను వార్షిక లక్ష్యాన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. అదేవిదంగా కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు,చల్లని నీటి సౌకర్యాన్ని అందుబాటులో ఉంచామన్నారు ఈ  సమావేశంలో ఎస్వోటూ జీఎం శ్రీనివాస్, డిజిఎం పర్సనల్ కిరణ్ ,డీవైపీఎం రాజేశ్వర్, ఐఈడీ ఎస్ ఈ యోహాన్  తదితులు పాల్గొన్నారు.

ఆసిఫాబాద్ లో  జాబ్ మేళా 

 

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 30 ;  కొమురంభీం జిల్లా కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం లో  నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్ మేళాను సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఉట్నూర్ మరియు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆసీఫాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు.  జాబ్  మేళాలో  సుమారు 80 మంది అభ్యర్థులు పాల్గొన్నారు.  ఈసందర్భంగా ఐటీడీఏ జేడీఎం నాగభూషణం మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ   యువకులు ఈ జాబ్ మేళాను  సద్వినియోగం  చేసుకోవాలన్నారు.  మల్టీ నేషనల్ కంపెనీలలో ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నామని మరియు నెలకు తొమ్మిది వేల నుంచి పదివేల జీతం మరియు  ఉచిత భోజనం తో  కూడిన ఉద్యోగ అవకాశాలు  కల్పిస్తున్నామని నిరుద్యోగ యువకులు ఈ  ఉద్యోగాల్లో చేరి తమ భవిష్యత్తును బంగారు మయం చేసుకోవాలని అన్నారు.  కార్యక్రమంలో  డిఆర్డిఓ వెంకట్ ,  డిపిఎం అన్నాజీ మరియు క్యాంపస్ గ్రూప్ హెచ ఆర్  మధుసూదన్, ప్రీమియం హోంకేర్ హెచ్ఆర్ వసంత్ మరియు ఏపీ ఫెటలిస్ హెచ్చార్ మహేందర్, ఐకేపీ సిబ్బంది సిసిలు  పాల్గొన్నారు  పాల్గొన్నారు. 

Sunday, 29 April 2018

హమాలీల న్యాయమైన హక్కుల సాధన కోసమే సమ్మె ; ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్

   కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 29 ;  హమాలీల హక్కుల సాధన కోసమే మే 1 నుండి నిరవధిక సమ్మె చేస్తున్నట్లు ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్ తెలిపారు.  ఆదివారం   ఆసిఫాబాద్ లో ఏర్పాటు చేసిన  విలేఖరుల  సమావేశంలో మాట్లాడారు.  ఏఐటీయూసీ అద్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా హమాలీల సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకుండా కాలయాపన చేస్తుదని అన్నారు. ప్రభుత్వం వెంటనే రేట్లు  పెంచాలని, హమాలీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని,జీవో నెం.28 ప్రకారం ఈ ఎస్ ఐ , పిఎఫ్, సౌకర్యం కల్పించాలని కోరారు,హమాలీల పై ప్రభుత్వం సవితి తల్లి ప్రేమ చూపించడం సరి కాదని అన్నారు. గత 40 సవంత్సరాల నుండి చాలి చాలని వేతనాలు తీసుకుంటూ నిత్యావసర సరుకుల ప్రజలకు పంపిణీ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.ఇప్పటికైనా కేసీఆర్ ముఖ్యమంత్రికి హమాలీల పై ప్రేమ ఉంటె ప్రపంచ కార్మిక దినోత్సవం రోజున ముఖ్యమంత్రి హమాలీల రేట్లు పెంచాలని,అలాగే హమాలీల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు.సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, బోనస్ 10 వేలు చెలించాలని, ప్రమాద నష్ట పరిహారం 6 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసారు.. ప్రపంచ కార్మిక దినోత్సవం132 వ మే డే ను జిల్లాలోని అన్ని వర్గాల కార్మికులు పాలుగోని విజయవంతం చేయాలని కోరారు. ఈ విలేఖరుల  సమావేశంలో హమాలీల సంఘం కార్యదర్శి బి. సుధాకర్, నాయకులు  కేశవ్, మోహన్, దివాకర్, తుకారం, బావుజి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Saturday, 28 April 2018

మే డే ను ఘనంగా జరుపుకోవాలి ; ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 28 ; కొమురంభీం జిల్లాలోని సంఘటిత, అసంఘటిత కార్మికులందరు  132 వ మే డే ఘనంగా జరుపుకోవాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్ అన్నారు. అని అన్నారు. కార్మిక హక్కులు ఏఐటీయూసీ తోనే సాధ్యం అని అన్నారు. కార్మిక హక్కుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశంలో పుట్టిన మొట్ట మొదటి కార్మిక సంఘం ఏఐటీయూసీ లు సాధించడంలో ఏఐటీయూసీ ఎప్పుడు ముందు ఉంటుందని అన్నారు. 1886 సవంత్సరంలో చికాగో అమరవీరుల పోరాట ఫలితంగా కార్మికులు తమ హక్కులు సాధించుకొన్నారని, అన్నారు,కానీ నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిసస్తున్నాయని, పెట్టుబడి దారులకు, పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా వ్యవరిస్తున్నాయని అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వాలు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు, అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని,8 గంటల పని విధానం కొనసాగించాలని, కనిసవేతనం 18000/- ఇవ్వాలని అన్నారు,కాంట్రాక్టు వ్యవస్థని పూర్తిగా రద్దు చేయాలని కోరారు కాంట్రాక్టుకార్మికులందరిని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు..జిల్లాలోని కార్మికులు అందరూ సంఘటితమై  మే డే  ను విజయవంతం చేయాలని కోరారు.

రహదారి భద్రతను జీవిత పాఠ్యాంశంగా చేర్చాలి : జనరల్ మేనేజర్ రవిశంకర్ - మద్యం తాగి వాహనాలు నడపొద్దు ఉమామహేశ్వరరావు ఎంవీఐ


 ప్రతి పౌరుడి జీవితంలో రోడ్డు భద్రత అంశాన్ని ఒక పాఠ్యాంశంగా చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని బెల్లంపల్లి ఏరియా గోలేటి జనరల్ మేనేజర్ రవిశంకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి తల్లిదండ్రులు పిల్లలకు తొలి గురువుగా మారి రహదారి భద్రతపై అవగాహన కల్పించాలని ఈ సందర్బంగా  పిలుపునిచ్చారు.ఇరవై తొమ్మిది వ జాతీయ రహదారి భద్రత వారోత్సవాలను పురస్కరించుకుని గోలేటి జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో అసిఫాబాద్ జిల్లా రవాణాశాఖ, బెల్లంపల్లి ఏరియా సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగులకు, కార్మికులకు, వాహన చోదకులకు, అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ రవిశంకర్ ముఖ్యఅతితిగా మాట్లాడాతు. అందరూ స్వీయ రక్షణ సూత్రాలను పాటించడం వల్ల 
 రహదారులపై వెళ్లేటప్పుడు రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నివారించడం సాధ్యమన్నారు. మనుషుల ఆలోచనా దృక్పథాలు మారకపోవడం వల్ల నిత్యం రోడ్డు ప్రమాదాలు జరిగి లక్షల్లో జనం చనిపోవడం జరుగుతుందని అన్నారు,వేల మంది క్షతగాత్రులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హెల్మెట్ సీటు బెల్టు పెట్టుకోకపోవడం  లాంటి చిన్న విషయాల్లో ఏమరుపాటుగా నిర్లక్ష్యంగా ఉండడం వల్ల విలువైన ప్రాణాలను కోల్పోతున్నామన్నారు.  గ్రామాల్లో జరిగే రోడ్డు ప్రమాదాల సంఖ్య తక్కువగా ఉన్న ఉంటున్నప్పటికీ ప్రాణనష్టం ఎక్కువగా జరుగుతుందన్నఅనర్దానికి  ప్రథమ కారణం, అవగాహన లేకపోవడం అని ఆవేధన వ్యక్తం చేశారు.  రహదారుల నిర్మాణంలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించడం డివైడర్లు సిగ్నల్స్ హెచ్చరిక చిహ్నాల ఏర్పాట్లు శాస్త్రీయంగా ముందుకు వెళ్తే ప్రమాదాలను నివారించే అవకాశం ఉందని అభిప్రాయ పడ్డారు.
 మోటార్ బైకులు ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడపడం సెల్ఫోన్లు ఉపయోగించి వాహనాలను నడపడం,  మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల ఇటీవల కాలంలో పెద్ద సంఖ్యలో ప్రమాదాలు పెరిగాయని  అన్నారు.  మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలు చేస్తే హైదరాబాద్ లో తల్లిదండ్రులకు జైలుకు పంపిస్తున్నామన్నారు.  దీన్ని తల్లిదండ్రులు గుర్తుంచుకుని మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వద్దని సూచించారు.  మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమయ్యే వారిపై హత్యానేరం కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.  ఇప్పటికే మంచిర్యాల పరిధిలో నాలుగు కేసులు నమోదయ్యాయని వివరించారు.  వేగ నియంత్రణ ట్రాఫిక్ సూత్రాలను విధిగా పాటించాలని ప్రతి ఒక్కరు రహదారి భద్రతా అవగాహన కలిగి ఉండాలని అందరిలోనూ చైతన్యం తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమానికి నిర్వహణకు సహకరించిన యాజమాన్యానికి ఈ సందర్బంగా  కృతజ్ఞతలు తెలిపారు.   ఈ కార్యక్రమంలో  ఎస్ఓటు జిఎం శ్రీనివాస్, డివైపిఎం సుదర్శన్, టిబిజికెఎస్ బెల్లంపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్  మల్రాజు  శ్రీనివాసరావు, అసిఫాబాద్ గిరిజన మహిళా డిగ్రీ కళాశాల ప్రినిపాల్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.

కొమురంభీం జిల్లా కేంద్రంలో కార్డాన్ సెర్చ్


 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 28; కొమురంభీం జిల్లా కేంద్రంలోని రవిచంద్ర కాలనీలో శనివారం తెల్లవారుజామున జిల్లా ఎస్.పి. కల్మేశ్వర్ సింగెనవార్  నేతృత్వంలో డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో కార్డాన్ సెర్చ్ నిర్వహించారు.   40 మంది పోలీసులతో  ఈ  కార్డన్ సెర్చ్   నిర్వహించినట్లు  పోలీసు అధికారులు తెలిపారు ఈ సందర్భంగా ఎస్.పి  మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకై పోలీసు శాఖ అనేకమైన చర్యలు చేపడుతున్నదని, అనుమానిత వ్యక్తుల కదలికలను కట్టడి చేయటానికి ఇటువంటి తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇదే సందర్భంలో ప్రజలతో మాట్లాడుతూ, పోలీసు శాఖాపరంగా వారి ఆలోచనలను పంచుకుంటూ, సూచనలు స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు.  తనిఖీల సందర్భంగా మహిళలు, యువతను చైతన్యపరిచేందుకు తమకు అవకాశం లభిస్తుందని తెలిపారు.  తనిఖీలలో  ప్రజలు కూడ చక్కగా సహకరించడం పట్ల ఎస్.పి. సంతృప్తి వ్యక్తపరిచారు. తనిఖీలలో  డి.ఎస్.పి. సాంబయ్య  ఇన్స్పెక్టర్లు  బాలాజీ వర ప్రసాద్, వాంకిడి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,ఎస్సై లు చంద్ర శేఖర్,40  మంది సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు జరిగిన తనిఖీలలో 8 మోటారు బైకుల ను తగిన దృవ పత్రాలు లేనందున అధికారులు స్వాధీనం చేసుకు న్నారు,150 గుట్కా ప్యాకెట్లు,40 మద్యం సీసాలను మరియు  2 లీటర్ల గుడుంబా ను స్వాధీనం చేసుకున్నామన్నారు.

ఉద్యోగ ఖాళీలు వెంటనే భర్తీ చేయాలి: తెలంగాణ జన సమితి జిల్లా సమన్వయకర్త లావుడ్య ప్రేమకుమార్

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 28 ; ఉద్యోగ ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ జన సమితి జిల్లా సమన్వయకర్త లావుడ్య ప్రేమకుమార్ అన్నారు. హైదరాబాద్ లో నేడు జరిగే తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభ గోడప్రతులను శనివారం రెబ్బెన మండల కేంద్రంలో విడుదల చేసారు. అనంతరం  మాట్లాడుతూ హైదరాబాద్లో నిర్వహించే ఆవిర్భావ సభ కు జిల్లా నుండి ప్రజలు అత్యధికంగా తరలిరావాలని జిల్లా సమన్వయకర్త లావుడ్య ప్రేమకుమార్ కోరారు. ఉద్యోగాలు దొరకక నిరుద్యోగులు ఆవేదనకు గురి అవుతున్నారని వారన్నారు. ఉన్న ఖాళీలను ప్రకటించి క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేయాలని ఎంత మొత్తుకున్నా ప్రభుత్వం చెవిన పడడం లేదని అన్నారు. రెండు లక్షల పైన ఉన్న ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టడం లేదన్నారు. విద్యార్థులకు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ కి డబ్బులు ఇవ్వడం లేదన్నారు, రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు ఇవ్వక  నెలలు తరబడి కాళ్ళు  అరిగేలా తిప్పుకుంటున్నారన్నారు. అక్కరకు  రాని    ప్రాజెక్టులు పెట్టి పనికిమాలిన పైపులు వేసి  కాంట్రాక్టర్లు జేబులు నింపుతున్నారని అన్నారు.  అలాగే  ప్రజల కొరకు పైసలు రావు కానీ కాంట్రాక్టర్ల కోసం అప్పులు చేయడానికి తెరాస ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకంలో కొమురంభీం జిల్లా ప్రజలకు పూర్తిగా  అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రంలో రెండు పంటలకు డబ్బులు ఇస్తే మన దగ్గర నీటి వనరు లేక ఒక్క పంట కూడా సరిగ్గా పండటం లేదన్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో  ఎం దేవేందర్, జి రాజేష్, డి మల్లయ్య, డి గణపతి, వెంకటేశ్, శంకర్, వినోద్, హరికృష్ణ, నూనయ్య,  విట్టల్, దేవాజి  తదితరులు పాల్గొన్నారు. 

Friday, 27 April 2018

బాల్యవివాహాన్ని అడ్డుకున్న అధికారులు


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 27 ; రెబ్బెన మండలం తుంగెడ  గ్రామంలో బాల్య వివాహం  జరుగుతుందన్న   సమాచారం తో   ఐ.సి.డి.ఎస్. జిల్లా సంక్షేమ అధికారిణి   సావిత్రి, రెబ్బెన ఎం ఆర్ ఓ సాయన్న,   టాస్క్ ఫోర్స్ సర్కిల్ ఇనస్పెక్టర్  రాంబాబు,  ఎస్.ఐ. శివ కుమార్,    ఐ.సి.డి.ఎస్ సూపర్ వైజర్  సరస్వతి లు వివాహ మండపానికి వెళ్లి  వివాహాన్ని  అడ్డుకొన్నారు. అధికారులు  శుక్రవారం ఉదయం   గ్రామానికి చేరుకొని విచారించగా గ్రామంలోని లింగయ్య కుమార్తె మనస (16) ను తాండూర్ మండలం కాసిపేట నివాసి మల్లేష్ కుమారుడు రాజేశం(30)  కు ఇచ్చి శుక్రవారం ఉదయం 10. 55 కు  వివాహం చేయుటకు నిశ్చయించారని తెలిసిందన్నారు.  ఐ.సి.డి.ఎస్. జిల్లాసంక్షేమ అధికారిణి   సావిత్రి మాట్లాడుతూ  ఇరువైపుల తల్లితండ్రులకు పెద్దల సమక్షంలో  మైనర్ బాలికకు వివాహం చేయడం చట్టరీత్య నేరమని, చిన్నతనంలో పెళ్లిళ్లు చేయటం వలన అనేక ఆరోగ్యసమస్యలు వస్తాయని తెలిపి వివాహాన్ని నిలుపుదల చేయటం జరిగిందన్నారు. అనంతరం టాస్క్ ఫోర్స్ సి ఐ  మాట్లాడుతూ  కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో ఎలాంటి బాల్య వివాహాలు జరిగినా( అమ్మాయికి 18సం.లు, అబ్బాయికి 21సం.లు ), చిన్న పిల్లలను(14సం.ల లోపల) పనిలో పెట్టుకున్న నిర్భయంగా తెలియ పరచవచ్చనీ, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది అని అన్నారు. సమాచారం ఇవ్వాల్సిన  ఫోన్ నంబర్లు 7901674826, 9000926208 అని తెలిపారు.  వీరితో పాటు   .టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు ప్రసాద్, వెంకటేష్ లు  పాల్గొన్నారు.



Thursday, 26 April 2018

టాస్క్ ఫోర్స్ తనిఖీలలో సుమారు 5,00,000/- విలువ చేసే మద్యం స్వాధీనం


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 26 ;  కోమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని చింతాలమనేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గురువారం సరిహద్దులో ఉన్న గూడెం గ్రామం నుండి మహారాష్ర్ట లో మద్య నిషేధం అమలవుతున్న గడ్చిరోలి జిల్లాకీ నిత్యం గుట్టుచప్పుడు కాకుండా  అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తుల వివరాలు సేకరించిన టాస్క్ ఫోర్స్ టీం సి.ఐ. అల్లం రాంబాబు నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు ప్రసాద్, వెంకటేష్ లు  గూడెం గ్రామంలో తనిఖీలు నిర్వహించగా కస్తూరి అశోక్ రెడ్డి, కస్తూరి రాఘవ రెడ్డి, బోయేరే రవి, జైస్వాల్ సంతోష్ మరియు జైస్వాల్ జవహర్ లాల్ ల వద్ద  సుమారు 5,00,000/- విలువ గల మద్యం మరియు 10 ఫీట్ల టేకు కలప నిల్వలు స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ నిమిత్తం చింతలమానేపల్లి  పి.ఎస్. పోలీస్ వారికి  అప్పగించడం జరిగింది.

రెబ్బెన మండలంలో నకిలీ పత్తి విత్తనాలపై విస్తృత తనిఖీలు ; ఇద్దరిపై కేసు నమోదు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 26 ; రెబ్బెన మండలంలో నకిలీ పత్తి విత్తనాలు విస్తృతంగా ఉన్నాయని సమాచారం మేరకు కాగజ్ నగర్ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో పోలీసులు విస్తృత సోదాలు చేపట్టారు కౌటాల సిఐ మోహన్, దేగాం ఎస్సై దికొండ రమేష్, బెజ్జూర్ ఎస్సై రామారావు ఆర్ఎస్ అనిల్ సుమారు నలభై మంది పోలీసుల బృందం గురువారం  తనిఖీలు  నిర్వహించారు. రెబ్బెన, ఖైర్ కూడా, తక్కలపల్లి రోళ్లపాడు గ్రామాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టి నకిలీ విత్తనాలు నిల్వ ఉంచినట్లు అందిన సమాచారంతో  అనుమానిత వ్యక్తులు ఇంట్లో సోదాలు నిర్వహించారు సోదరులుగా రెవరెండ్ కేంద్రంలోని చిట్టినేని అప్పారావు ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఇరవై కిలోల బీటీ త్రి విత్తనాలుఖైర్ కూడాలో అజ్మీర సీతారాం ఇంట్లో పది కిలోలు బీటీస-3 విత్తనాలు లభ్యమయ్యాయన్నారు. తనిఖీల్లో పట్టుబడ్డ విత్తనాలను స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ను తరలించారు. అక్రమంగా నకిలీ విత్తనాలు నిల్వ ఉంచిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నర్సయ్య తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ సాంబయ్య మాట్లాడుతూ ప్రభుత్వం నిషేధించిన బీటీ త్రి పత్తి విత్తనాలను అక్రమంగా నిల్వ ఉంచితే కఠిన చర్యలతో తీసుకుంటమన్నారు.  అన్నారు ఇతర ప్రాంతాల నుండి జిల్లాకు నకిలీ విత్తనాలు సరఫరా అయ్యాయని ముందస్తుగా అందించిన సమాచారతో ఎస్పీ కాలేజీ కల్మేశ్వర్ సింగనవార్ ఆదేశాలతో  పలు గ్రామాల్లో విస్తృత తనిఖీలు చేపట్టామన్నారు నకిలీ విత్తనాలు సరఫరా కాకుండా ఎక్కడికక్కడే గట్టి నిఘా పెంచినట్లు తెలిపారు

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి ; ఎస్ వొ టూ జీఎం శ్రీనివాస్


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 26 ; విద్యార్థులు చదువుతో పాటు  క్రీడల్లో  రాణించాలని ఎస్ వొ టూ జీఎం శ్రీనివాస్ అన్నారు.: బెల్లంపల్లి ఏరియా డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ ఆధ్వర్యంలో రెండువేల పద్దెనిమిది సంవత్సరానికి సంబంధించిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు గురువారం గోలేటిలో  బిమన్న స్టేడియంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడలో  విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. ప్రతి క్రీడల్లో నైపుణ్యాలను సాధించాలన్నారు సంస్థల్లో కార్మిక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా డబ్ల్యూపీఎస్ అనాతవరంలో ప్రతి కంపరం కార్మిక పిల్లల కోసం వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తామన్నారు సీనియర్ అనుభవం కలిగిన సీనియర్ క్రీడాకారులతో చిన్నారులకు క్రీడా మెళకువలు తెప్పిస్తూ క్రీడల అభివృద్ధి కోసం కృషి చేస్తుందన్నారు నెల్రోజుల్లో పాటు కొనసాగే ఈ శిక్షణ శిబిరాల్లో భాగంగా గోలేటి వాలీబాల్ ఫుట్బాల్ పోటీ ఆధారం పంక్తుల్లో అదిలించి శిక్షణా కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిజిఎం పర్సనల్ కిరణ్, డివైపిఎం సుదర్శన్, టిబిజికెఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజ్ శ్రీనివాసరావు, అసిస్టెన్స్ ఫోర్స్ సూపర్వైజర్ రమేష్, స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ చంద్రకుమార్, టిబిజికెఎస్ నాయకులు చార్లెస్, తాళ్ళపల్లి రాములు తదతరులు పాల్గొన్నారు. 

కనకదుర్గ దేవి జాతర గోడ ప్రతుల విడుదల


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 26 ; రెబ్బెన  మండల కేంద్రం ఇందిరానగర్ లోని  కనకదుర్గ దేవి మరియు స్వయంభూ మహంకాళి అమ్మవారి జాతర వచ్చే నెల  1,2,3 తేదీలలోజరగనుండడంతోగురువారం జాతర  గోడ ప్రతులను  ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి విడుదల చేసారు. తదనంతరం అమ్మవారిని దర్శించుకొని  జాతరకు సంబందించిన ఏర్పాటు వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో  ఆలయ కమిటీ చైర్మెన్ అభినవ సంతోష్ కుమార్, ఆలయ కమిటీ  ప్రధాన కార్యదర్శులు మోడెమ్ తిరుపతి గౌడ్, లెక్కల నవీన్ కుమార్, సంయుక్త కార్యదర్శి అవుల రాజనర్సు, మస్కా రమేష్, సంధ్య, అనిత, మధుకర్ ,సంతోష్ , తిరుపతమ్మ, లలిత, గ్రామ ప్రజలు మరియు  ఆలయ పూజారి దేవార వినోద్ తదితరులు పాల్గొన్నారు.

చేపల పెంపకం కై చెరువు అభివృద్ధి పనులు ప్రారంభం

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 26 ;   రెబ్బెన మండలం     నంబాల గ్రామంలో స్థానికంగా ఉన్న చెరువును వచ్చే వర్షాకాలంలో చేపల పెంపకానికి అనువుగా చేయడానికి అభివృద్ధిపనులను    నంబాల సర్పంచ్ గజ్జెల సుశీల  పూడిక పనులను ప్రారంభించారు. ఈ పనులను ఉపాధి హామీ పనులలో భాగంగా చేపడుతున్నట్లు తెలిపారు.    ఈ సందర్బంగా  వారు  మాట్లాడుతు చాపల పెంపకం కై రెండు మీటర్ల లోతుతో 20/20 మీటర్ల వెడల్పుతో ఈ పనులను చేపట్టడంజరుగుతుందన్నారు.   ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ గజ్జెల  సత్యనారాయణ,ఇజిఎస్,టిఏ,ఎఫ్ఏ మరియు  ఉపాధి హామీ కూలీలు రామయ్య,  మల్లేష్ శాంకరి తదితరులు పాల్గొన్నారు. 

Wednesday, 25 April 2018

మిషన్ భగీరథ పనులు వేగవంతం చేయాలి ; చీఫ్ ఇంజనీర్ జగన్మోహాన్ రెడ్డి


 
   కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 25 ; ఆసిఫాబాద్ జిల్లా లోని మారుమూల ఏజెన్సీ ప్రాంతాలలో ప్రజలు నీటి కష్టాలు ఎదుర్కొంటున్నందున మిషన్ భగీరథ పనులు వేగవంతం చేసి ఇంటింటికీ నల్లా నీరు అందించాలని చీఫ్ ఇంజనీర్  జగన్మోహాన్ రెడ్డి అన్నారు. బుధవారం అధికారులు, ఇంజనీర్లతో జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్  సమీక్ష సమావేశంను నిర్వహించారు.ఈ సందర్బంగా చీఫ్ ఇంజనీర్  జగన్మోహాన్ రెడ్డి మాట్లాడుతు ముఖ్యమంత్రి చేపట్టిన  మిషన్ భగీరథ  భాగంగా ఇంటింటికీ  నల్లా నీరు అందించే విదంగా  పనులలో వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. కొండల్లో గుట్టలల్లో  పైపులైన్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతు ఇఇలు,ఏఇల పనుల తీరును అడిగి తెలుసుకున్నారు.మండలం లోని హబిటేషన్  మిషన్ భగీరథ పనులు పదిహేను రోజుల్లో పూర్తిచేయాలన్నారు. తప్పుడు సమాచారం ఇవ్వకుండా సరైన సమాచారం అందజేయాలన్నారు. మిగతా జిల్లాల్లో ఎలా ఉందో ఈ జిల్లాలో కూడా పూర్తి సమాచారంతో మిషన్ భగీరథ పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశానికి  ఎమ్మెల్సీ పురాణం సతీష్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పాల్గొని  వచ్చే నెల వరకు ప్రజలందరికీ త్రాగునీటి సౌకర్యం కల్పించే విధంగా కృషిచేయాలన్నారు. ఆవిధంగా ఇంటింటికి నల్లానీరు పనులపై సమీక్షించారు ఆగస్టునెల వరకు ఇంటికి నీరందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో ఎస్ ఇ  ప్రకాశ్ రావు, ఈ ఈ రమణ, డిప్యూటీ ఇఇ  నాగేశ్వరరావు, ఎల్&టి సుబ్రహ్మణ్యం, మెగా ప్రాజెక్ట్ మేనేజర్లు అసిస్టెంట్లు ఈ ఈ  వివిధ మండలాల నుండి వర్కర్స్ ఏజెన్సి కాంట్రాక్టులు తదితరు పాల్గొన్నారు.

సమ్మర్ కోచింగ్ క్యాంప్.

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 25 ;: బెల్లంపల్లి ఏరియా సొంగరేణి WPS &GA ఆధ్వర్యంలో 2018-2019 సంవత్సరానికి గాను సమ్మర్ కోచింగ్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నట్లు ఏరియా డిజియం పర్సనల్ జె కిరణ్ కుమార్ తెలిపారు. గోలేటి బీమన్న స్టేడియం లో ఫుట్ బాల్, వాలీబాల్ క్యాంప్ కోచింగ్ కై నిర్వహించడం జరుగుతుంది అన్నారు. అలాగే మాధారం టౌన్ షిప్ స్టేడియం లో అథ్లెటిక్ కోచింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కోచింగ్ క్యాంప్ 26/04/2018 నుండి 20/05/2018 వరకు నిర్వహించడం జరుగుతుంది అన్నారు.సింగరేణిలో పనిచేస్తున్న కార్మిక పిల్లలు ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఆసక్తిగల వారు తమ దరఖాస్తులు జియం ఆఫీస్ లోని పర్సనల్ డిపార్ట్మెంట్ నందు అందజేయాలని తెలిపారు.

టాస్క్ ఫోర్స్ సంచలన దాడిలో మద్యం, కలప మరియు గుట్కా నిల్వ పట్టివేత


 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 25 ; వాంకిడి మండల లోని ఇందాని, బెండార గ్రామంలో అక్రమంగా మద్యం,గుట్కా మరియు కలప నిల్వలు ఉన్నట్లు  ఖచ్చితమైన నిఘా సమాచారంతో టాస్క్ ఫోర్స్ సి.ఐ అల్లం రాంబాబు ఆధ్వర్యంలో  టాస్క్ ఫోర్స్ బృ దం  తనిఖీ చేసారు.  ఈ తనిఖీలో  కుదురుపాక సాంబయ్య ఇంట్లో అక్రమంగా అమ్ముతున్న  16,345/-  విలువగల మద్యం  మరియు 4,860/- విలువగల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందని  తెలిపారు.   బెండార గ్రామంలో తనిఖీ నిర్వహించగా గులాబ్ షాపులో 6,255/- విలువగల మద్యం మరియు నగోష శేఖర్ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 24,000/- విలువ చేసే 10 ఫీట్ల టేకు చెక్కలు, 19,740/- విలువ చేసే మద్యం మరియు 2,852/- విలువగల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ నిమిత్తం వాంకిడి పి.ఎస్. పోలీస్ వారికి  అప్పగించడం జరిగిందన్నారు.  టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు ప్రసాద్, వెంకటేష్ లు ఉన్నారు.

రైలు కిందపడి వ్యక్తి మృతి

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 25 ;  రెబ్బెన  మండలం తక్కళ్లపల్లి  రేపల్లెవాడ మధ్యలో డౌన్ లైన్ పై  ఖైర్గాం గ్రామానికి చెందిన తౌటి శ్రీనివాస్ (38) గుర్తు తెలియని  రైల్ కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు  బెల్లంపల్లి రైల్వే ఎస్సై జితేందర్   తెలిపారు.  ఆయన తెలిపిన వివరాల ప్రకారం తక్కళ్లపల్లి రేపల్లెవాడ మధ్య డౌన్ లైన్ పై  మృతదేహం ఉందన్న సమాచారం మేరకు వచ్చి పరిశీలించగా  ప్రాధమిక దర్యాప్తులో మృతుడు ఖైర్ గాం  కుచెందిన    లారీ డ్రైవర్ తౌటి శ్రీనివాస్ (38) గా  గుర్తించినట్లు తెలి పారు. మృతుని కి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నట్లు తెలిపారు. తీవ్ర అనారోగ్య సమస్యతో  మృతుడు ఈ  అఘాయిత్యానికి పాల్పడినట్లు  తెలిసిందన్నారు.   కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Tuesday, 24 April 2018

చికిత్స పొందుతున్న మహిళ మృతి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 24 ; రెబ్బెన మండలంలో  రేకులుగూడలో  సోమవారం రాత్రి ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని తీవ్రంగా గాయపడిన కొమరం కమలాబాయి(35) అనే మహిళ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం సోమవారం రాత్రి కిరోసిన్ దీపం చేత పట్టుకుని కోళ్లను గూటిలో కమ్మే ప్రయత్నం  చేస్తుండగా కోడి ఎగిరి తన్నడంతో దీపం ఒలికి  కమలాబాయి పడింది. దీంతో కమలాబాయి తివ్రంగా గాయపడింది దాంతో స్థానికులు హుటాహుటిన 108లో  బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. పరిస్థితి విషమంగా మారటంతో మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలికి భర్త బాపు ఒక కుమారుడు ఉన్నారు.

పురుగుల మందు సేవించి రైతు మృతి ; రైతును మింగిన అప్పులు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 24 ;  పంటల కోసం చేసిన అప్పులే తనపాలిట శాపంగా మరి తీవ్ర మనస్థాపానికి  గురై పురుగుల మందు సేవించి ఆసిఫాబాద్  చోర్ పల్లి గ్రామానికి చెందిన బోయిరి దావు (45) సోమవారం రాత్రి అప్పుల బాధ తాళలేక ఆత్మ  హత్యకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు తెలిపిన  వివరాల ప్రకారం  తాత తండ్రుల నుంచి సంక్రమించిన ఆరు ఎకరాల భూమినిసాగు చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.  కూతురి వివాహం కోసం   సుమారు పది లక్షల మేర అప్పు చేశాడు.  గత ఏడాది ఏడు లక్షల యాభై వేలు అప్పు కింద నాలుగు ఎకరాల భూమిని అప్పు ఇచ్చిన వ్యక్తి తీసుకున్నాడు.   మిగిలిన రెండు ఎకరాల్లో సేద్యం చేసినప్పటికీ అంతగా దిగుమతి రాకపోవడంతో మిగిలిన అప్పులు ఎలా తీర్చాలని మనస్థాపానికి  గురై  సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు సేవించాడు.  కొద్దిసేపటి తర్వాత వాంతులు చేసుకోవడంతో గమనించి భార్య ఇరుగు పొరుగు వారికి తెలియజేయడంతో వారు వెంటనే 108 అంబులెన్స్లో  ఆసిఫాబాద్  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా  చికిత్స పొందుతూ మృతిచెందాడు.  మృతునికి భార్య కమల ,  ఇద్దరు కుమారులు ఒక కూతురు ఉన్నారు మృతుడి కుటుంబ సభ్యులను మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు   చిట్ల నారాయణ పరామర్శించారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో అల్ఫాహారం పంపిణీ

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 24 ; రెబ్బెన మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో  తెరాస  మహిళా విభాగం జిల్లా  అధ్యక్షులు  కుందారపు శంకరమ్మ   మంగళవారం గర్భిణీ స్త్రీలకు అల్ఫాహారం   పంపిణీచేశారు. ఈ సందర్భంగా కుందారపు శంకరమ్మ మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రికి వచ్చే వారికి తమ వంతుగా సహాయ సహకారాలు అందించాలన్న ఉద్దేశంతో  మన ముఖ్యమంత్రి  కెసిఆర్   పేరు మీద అల్ఫాహారం పంపిణి   చేపట్టినట్లు  తెలిపారు. తెరాస  పార్టీ కార్యకర్తల తరపు నుంచి ఇలాంటి  కార్యక్రమాలు మరెన్నో చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో మన్యం  పద్మ, అన్నపూర్ణ అరుణ ఆసుపత్రి సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.

టాస్క్ ఫోర్స్ దాడిలో రవాణాకు సిద్దంగా ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 24 ; రెబ్బన పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆసిఫాబాద్ రోడ్  రైల్వే స్టేషన్ బయట రామగిరి ట్రైన్ లో రవాణా చేయటానికి సిద్ధంగా రేషన్ బియ్యం నిల్వలు ఉన్నాయి అని  ఖచ్చితమైన నిఘా  సమాచారం తో టాస్క్ ఫోర్స్ సి. ఐ  రాంబాబు నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు ప్రసాద్, వెంకటేష్ లు  మంగళవారం  దాడిచేశారు. దాడిలో  రైల్వే స్టేషన్ బయటి ఆవరణలో  దాట్ల రాజయ్య మరియు మాటురి రజిత అనే ఇద్దరు వ్యక్తులు రవాణాకు సిద్దంగా ఉంచిన 8 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ నిమిత్తం  రెబ్బన  పి.ఎస్. పోలీస్ వారికి  అప్పగించడం జరిగింది.

టాస్క్ ఫోర్స్ మెరుపు దాడిలో మద్యం మరియు బెల్లం నిల్వ పట్టివేత

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 24 ; ఆసిఫాబాద్ చిర్రకుంట గ్రామంలో అక్రమ మద్యం మరియు బెల్లం నిల్వలు న్నాయన్న  ఖచ్చితమైన నిఘా  సమాచారం తో ఎస్పీ కల్మేశ్వర్ సింగన్ వార్ ఆదేశాల మేరకు   టాస్క్ ఫోర్స్  సి. ఐ అల్లం రాంబాబు నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు ప్రసాద్, వెంకటేష్  లు   మంగళవారం సోదాలు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు.   చిర్రకుంట గ్రామంలో  తనిఖీ చేయగా అరిగెల మవిన్ కుమార్ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 10,220/- విలువగల మద్యం మరియు 15 కిలోల  ల బెల్లం, కోట కుమార్ ఇంట్లో  10,710/- విలువగల అక్రమ మద్యం మరియు జమ్ముల రమేష్ షాపులో 6,215/- విలువగల మద్యం స్వాధీనం చేసుకొని కేసు ను  తదుపరి విచారణ నిమిత్తం ఆసిఫాబాద్ పి.ఎస్. పోలీస్ వారికి  అప్పగించడం జరిగింది.

Monday, 23 April 2018

అగ్ని ప్రమాదంలో మహిళకు గాయాలు

రెబ్బెన మండలంలో  రేకులుగూడ గ్రామంలో  సోమవారం రాత్రి ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో కొమరం కమలాబాయి అనే మహిళ తీవ్రంగా గాయపడింది. స్థానికుల కథనం ప్రకారం కమలబాయి కిరోసిన్ దీపం చేత పట్టుకుని ఇంట్లో ఉన్న కోళ్లను గుడ్లు కమ్మేందుకు ప్రయత్నిస్తుండగా కోడి ఎగిరి దీపాన్ని తన్నడంతో ప్రమాదశాత్తు దీపం వలికి చీరపై పడింది దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి చేతులు చతి భాగంలో తీవ్రంగా గాయాలయ్యాయి.  మంటల ధాటికి తట్టుకోలేక అరుపులు వేయడంతో గమనించిన చుట్టుపక్కల వాళ్లు వచ్చి మంటలను అదుపు చేసి కాపాడారు. సమాచారం అందుకున్న ఎస్సై శివకుమార్ హుట హుటిన సంఘటన స్థలానికి చేరుకుని బాధితురాలి పరామర్శించారు. ప్రమాదశాత్తు తీవ్రంగా గాయపడ్డ ఆమెను చికిత్స  నిమిత్తం 108 లొ బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం మంచి రాళ్లకు తరలించారు.

ఓటరు జాబితా విభజన సమీక్షా

  
   రెబ్బెన:సోమవారం రోజున ఎంపిడివో కార్యాలయంలో ఓటరు జాబితాపై ఎంపిడివో కార్యాలయ సిబ్బంది తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సత్యనారాయణ సింగ్ మాట్లాడుతు కొత్తగా ఏర్పడిన గ్రామల ఓటరు  విభజన జాబితాలను పొందు పర్చాలన్నారు.

గిరిజన మండలాలలో పర్యటించిన బీజేపీ బృందం ;


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 23 ;  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బీజేపీ బృందం     గిరిజన ఏజన్సీ మండలా  లైన తిర్యాణి. లింగపూర్. సిర్పూర్ యు, .జైనూర్ మండలాలలో  ప్రజల ఇబ్బందులను తెలుసుకోవడానికి      పర్యటించింది.  ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కేసరి ఆంజనేయులుగౌడ్ మాట్లాడుతూ ముఖ్యంగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని మిషన్ భగీరథ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయన్నారు. ఏళ్ళకి  ఏళ్లు గడుస్తున్నా మంచినీటి సమస్య పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మండల కేంద్రానికి చేసుకోవడానికి రహదారులు అధ్వానంగా ఉన్నాయని వేసిన రోడ్లు కాంట్రాక్టర్లు అధికారుల అవినీతి మూలంగా అధ్వాన్నంగా తయారయ్యాయన్నారు.  . ఏళ్ల తరబడి సాగు చేస్తున్నా అటవీ భూములకు పట్టాలు ఇవ్వక పోవడంతో  సాగు కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారన్నారు. . ప్రభుత్వ భూములు కాస్తు చేస్తున్న  వారందరికీ రైతు బందు పథకం అందరికీ వర్తింప చేసి పట్టాలు ఇవ్వాలని. కేంద్రప్రభుత్వం ప్రదాన మంత్రి ఉజ్జ్వల యోజన  ద్వారా యస్ సి. యస్ టి. మహిళల లకు గ్యాస్ కనెక్షన్లు సిలిండర్ . స్టౌ ఉచితంగా పంపిణీ చేస్తున్నారన్నారు.   కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ డీలర్లు. కొన్ని గ్రామాల్లో సబ్ డీలర్లను ఏర్పాటు చేసుకుని అమయక ప్రజలను దోపిడీ చేస్తున్నారు అన్నారు. ఇలాంటి  గ్యాస్ ఏజెన్సీల పై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏన్నికల ముందు . డబుల్ బెడ్ రూమ్ ఇల్లు. దళితుడు ముఖ్యమంత్రి. దళితులకు మూడు ఎకరాల భూమి. ఇంటికో ఉద్యోగం. లక్ష ఉద్యోగాలు భర్తీ. కెజి నుంచి పిజి వరకు ఉచిత విద్య. లాంటి మరెన్నో హామీలు ఇచ్చి అమలు చేయడం లేదని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రజలకు ప్రతి ఇంటికి అందేలా బిజెపి నాయకులు , కార్యకర్తలు సైనికుల లాగా పని చెయ్యాలన్నారు. ఈకార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి అన్నపూర్ణ సుదర్శన్. జదవ్ రమేష్.జిల్లా కోశాధికారి బిజన్ మల్లిక్. గిరిజన మోర్చ జిల్లా అధ్యక్షులు మడావి షైన్ షా. మండల అధ్యక్షులు జదవ్ రామారావు,  ప్రదాన కార్యదర్శి మడావి శెకు, తదితర నాయకులు పాల్గొన్నారు.

కేంద్రప్రభుత్వ పథకాల అమలు తీరు పై కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ సమీక్ష

   
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 23 ;  కేంద్రప్రభుత్వ పథకాల అమలు తీరును కేంద్రప్రభుత్వ అర్బన్ అఫైర్స్  డిపార్ట్మెంట్ డిప్యూటీ సెక్రటరీ జానకి సోమవారం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం కిష్టాపూర్ గ్రామంలోజరిగిన గ్రామ సభలో   సమీక్షించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వ  పథకాలద్వారా మారుమూల గ్రామాలలోని ప్రజలకు   లబ్ది అందేలా చూడాలని  అన్నారు.ఏప్రిల్ 15  నుంచి మే 5 వరకు కేంద్ర  ప్రభుత్వ పథకాలు అమలు మరియు వాటి గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారుభారత దేశంలో ప్రతి ఒక్కరు  ప్రధానమంత్రి    జీవన్ జ్యోతి బీమా యోజన  పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.  ఇప్పటి వరకు ప్రజల్లో ఈ పథకానికి సంబంధించి అవగాహన ఉన్న కూడా ఈ పథకానికి దూరంగా ఉంటున్నారన్నారు.  సంబంధిత  శాఖ  వారు ఈ విషయంపై  దృష్టి సారించి ప్రతి ఒక్కరికి భీమా యోజన పథకం వర్తింపజేయాలన్నారు. భీమా ప్రీమియం తక్కువ మరియు  భీమా  ఎక్కువ అని అన్నారు. ప్రతిఒక్కరు భీమా  చేసుకొనేటట్లు కృషి చేయాలన్నారు. అలాగే  ప్రధాన మంత్రి సౌభాగ్య యోజన పథకం ద్వారా పల్లె, పట్టణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి విద్యుత్తును అందించడంలో  భాగంగా  సౌభాగ్య యోజన అనే పథకాన్ని  ఆవి ష్కరించారు.అన్నారు. ఇప్పటి కీ విద్యుత్ అందని ఇంటికి  సౌభాగ్య పథకం  కింద ప్రతి  ఇంటికి విద్యుత్తు అందించాలని  అన్నారుఎటువంటి ఖర్చు లేకుండా కరెంటు మీటర్ పొందవచ్చని అన్నారు. ఇంకొక పథకమైన మిషన్ ఇంద్రధనష్  పేద మహిళలు ఈ సేవలను వినియోగించుకోవాలని,  శిశుమరణాలను తగ్గించడానికి మిషన్ ఇంద్రధనష్ ద్వారా వ్యాక్సినేషన్లను తప్పనిసరిగా వేసుకోవాలన్నారు.  మిషన్ ఇంద్రధనస్సు లో వైద్య సిబ్బంది మరియు ఆశ కార్యకర్తలు గ్రామాల్లో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు.ప్రధాన మంత్రి ఉజ్వాల యోజన ఈ పథకం ద్వార దారిద్ర రేఖకు దిగువగ ఉన్న ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ కనెక్షన్లను  కేంద్ర ప్రభుత్యం అందజేస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా  గ్రామంలోని లబ్దిదారులకు గ్యాస్ కనెక్షన్ లను అందచేశారు.  ఈ పథకాన్ని గ్యాస్ లేని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. ప్రధాన మంత్రి జన ధన్ యోజన ఈ  స్కీంలో భాగంగా  ఖాతాతెరచిన ప్రతి వ్యక్తి కుటుంబం మొత్తo తమ జీవిత కాలమంతా  లక్ష రూపాయల ప్రమాద భీమాకు అర్హత లభిస్తుంది అన్నారు. జీవిత భీమా సదుపాయాన్ని బ్యాంకు ఖాతా ద్వారా రెన్యూవల్ చేసుకొని ప్రమాద భీమా పొందవచ్చని సూచించారు. డిజిటల్ ఇండియా పథకంలో భాగంగా భౌతికంగా డబ్బు మార్పులేని ఆర్ధిక వ్యవస్థకు పునాది వేయడమే  జన్ ధన్ యోజన యొక్క దీర్ఘకాలిక ప్రణాళిక అని అన్నారు.అనంతరం కొమురంభీం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను ప్రతి ఒక్క శాఖ   వారు కూడా విధిగా లబ్ధిదారులకు అందే విదంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ కారక్రమంలో మంచిర్యాల్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, డిఆర్డిఓ వెంకట్,డిపిఓ గంగాధర్,డి ఎం హెచ్ ఓ సుబ్బారాయుడు,డిప్యూటీ డిఎమ్హెచ్ఓ  సీతారాం,పిడి సావిత్రి, రెబ్బెన ఎమ్మెర్వో సాయన్న ,ఎంపిడివో సత్యనారాయణ సింగ్,ఎంఈవో వెంకటేశ్వర స్వామి తదితర మండలాధికారులు పాల్గొన్నారు.

Sunday, 22 April 2018

స్వయం ఉపాధి కల్పించుకోవడం సంతోషదాయకం ; ఎమ్మెల్యే కోవా లక్ష్మి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 22 ; నిరుద్యోగ యువకులు స్వయం ఉపాధి కల్పించుకోవడం సంతోషదాయకం  అని అన్నారు.  ఆదివారం రెబ్బెన మండల కేంద్రంలో నూతనంగా  నెలకొల్పిన శివ సాయి పేపర్ ప్లేట్ ప్రొడక్ట్స్  తయారీ కేంద్రాన్ని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతు పోటీ ప్రపంచంలో యువకులు ఎంతో నేర్పుతో వారి ఆలోచనలకు అనుగుణంగా  ఎంచుకున్న  స్వయం ఉపాధికి   ప్రభుత్వ పరంగా సబ్సిడీ రుణాలను అందజేస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన సర్పంచ్ పేసరి వెంకటమ్మ,,ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ గంధం శ్రీనివాస్,మార్కెట్ కమిటీ వైస్  ఛైర్మెన్ కుందారపు శెంకరమ్మ,గ్రంధాలయ ఛైర్మెన్ కనక యాదవరావు,టీబీజీకేఎస్ నాయకుడు మల్రాజ్ శ్రీనివాస్, ఉపసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, తెరాస నాయకులు సుదర్శన్ గౌడ్, గొడిసెల వెంకన్న గౌడ్, మాజీ సర్పంచ్ దుర్గం హన్మంతు, దుర్గం బరత్వాజ్ తదితరులు పాల్గొన్నారు.

యువత మంచి లక్షణాలు అలవర్చుకోవాలి ; ఎమ్మెల్యే కోవలక్ష్మి


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 22 ;  యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మంచి లక్షణాలు అలవర్చుకోవాలని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మన  జిందగీ లఘుచిత్ర సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన రుద్ర నేత్ర లఘు చిత్రంకు సంబందించిన ప్రచార పత్రాలను విడుదల చేశారు.  అనంతరం మాట్లాడుతూ సమాజ మార్పుకు ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెడు వ్యసనాలకు బానిస కావడం ద్వారా కుటుంబం చిన్నాభిన్నమవుతుందన్న   అంశంపై నిర్మించిన చిత్రం అందరికీ ఆదర్శంగా నిలవాలని సమాజంలో స్త్రీని చిన్నచూపు చూసే పద్ధతి మారాల్సిన అవసరం ఎంతో ఉందని ఇలాంటి చిత్రాలు చూపించడం వల్ల యువతలో మార్పు వచ్చి మంచి లక్షణాలు అవలంభిస్తారని అన్నారు. ఇలాంటి లఘుచిత్రాలు నిర్మిస్తున్న సంస్థను అభినందించారు. ఈ సందర్భంగా మన జిందగీ సంస్థ డైరెక్టర్ నగరపు రాజశేఖర్ మాట్లాడుతూ సమాజంలో మార్పు వచ్చేందుకు తమ వంతుగా చిత్రాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. అదే క్రమంలో సమాజహిత చిత్రాలను నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కనక యాదవరావు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎస్ జీవన్, సంస్థ సభ్యులు మహేందర్, రామకృష్ణ, స్వామి, రాజశేఖర్, కడతల సాయి తదితరులు పాల్గొన్నారు.

బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలి వేంద్రం ఏర్పాటు

 బెటర్ యూత్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 22 ;  బాటసారుల దాహార్తిని తీర్చేందుకు వేసవి కాలం సందర్బంగా రెబ్బెన మండలం  గోలేటి బస్టాండ్ వద్ద బెటర్ యూత్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం  చలివెంద్రం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ రవి శంకర్ హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సమాజ శ్రేయస్సుకై ఎంతో కొంత చేయాలనీ నిర్ణయించుకొని అనేక సేవ కార్యక్రమాలు చేస్తున్న బెటర్ యూత్ బెటర్ సొసైటీ సేవా సంస్థ ని అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు జేబీ పౌడెల్, బెటర్ యూత్ బెటర్ సొసైటీ సేవా సంస్థ అధ్యక్షులు ఓరగంటి రంజిత్, గౌరవ అధ్యక్షులు లక్ష్మణ చారి, ఉపాధ్యక్షులు రవీందర్, ప్రధానకార్యదర్శి అజయ్, సహాయ కార్యదర్శి విజయ్, సభ్యులు తిరుపతి, సతీష్, అరవింద్, తిరుపతి, రవి, శ్రీను, జగన్, తెరాస నాయకులు ఆత్మరామ్ నాయక్, ఎంపీటీసీ  సురేందర్, కారోబార్ సుధాకర్, పల్లాస్, తదితరులు పాల్గొన్నారు. 

Saturday, 21 April 2018

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు: టాస్క్ ఫోర్స్ సి ఐ రాంబాబు



 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 21 ;  కుమురం  భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో  ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా  కఠిన చర్యలు తప్పవని టాస్క్ ఫోర్స్ సిఐ  అల్లం రాంబాబు  అన్నారు.  మీ పరిసరాల్లో ఎవరైనా, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లైతే  ప్రజలు వెంటనే సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచబడతాయని అన్నారు. పేద    ప్రజల కోసం ప్రభుత్వం అందిస్తున్న రూపాయి కిలో  సబ్సిడీ బియ్యాన్ని   వ్యాపారంగా మార్చుకుని నిత్యం రోడ్డు మరియు రైలు మార్గం గుండా   మహారాష్ట్ర మరియు ఇతర ప్రదేశాల కు తరలించే అక్రమ  వ్యాపార  ముఠాలకు అడ్డుకట్ట చేస్తామని అన్నారు.   బియ్యం అక్రమ రవాణా చేయడం మానుకోవాలని, లేదంటే తరుచూ దాడులు నిర్వహిస్తామని , బియ్యం అక్రమ రవాణా చేసేవారిని గుర్తించి కేసులు నమోదు  చేస్తామన్నారు. 

Friday, 20 April 2018

ప్రధానమంత్రి ఉజ్వల్ అభియాన్ పథకంలో వంట గ్యాస్ పంపిణి

  
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 20 ; ప్రధానమంత్రి ఉజ్వల్ అభియాన్ పథకం ద్వారా రెబ్బెన మండలం తుంగ డ  గ్రామంలో శుక్రవారం  పలువురు మహిళలకు వంట గ్యాస్ కనెక్షన్ లను అందచేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మి బాయి  , హెచ్ పి  గ్యాస్ డీలర్లు ప్రకాష్ అగర్వాల్, రాకేష్ అగర్వాల్ లు వంటగ్యాస్ పట్ల గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ పథకం కింద  లబ్ది దారులకు సబ్సిడీ పైన గ్యాస్  కనెక్షన్ లను అందచేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్యాస్ కనెక్షన్ వాడటం వళ్ళ వంట చెరుకు కోసం  చెట్లను నరికివేత కాస్తైనా తగ్గుముఖం పడుతుంది అని అన్నారు. పాతపద్ధతిలో కాకుండా వంట గ్యాస్ పైననే వంట చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు భగవాన్ , పర్వతాలు, వార్డ్ మెంబెర్ లు రుక్కుమ్ బాయి , పార్వతి ,అంగన్వాడీ కార్యకర్త అమృత, ఫీల్డ్ అసిస్టెంట్ రహీమ్ పాషా, వి ఆర్ ఓ లు వెంకటేష్, నాందేవ్ గ్రామస్తులు పాల్గొన్నారు. 

పాలీసెట్ కు ఏర్పాట్లు పూర్తి


   కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 20 ; ఈ నెల 21 న జరగనున్న పాలీసెట్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆసిఫాబాద్ కో ఆర్డినేటర్  అజ్మీర  గోపాల్ అన్నారు. శుక్రవారం  అసిస్టెంట్ కో ఆర్డినేటర్ రామకృష్ణ తో కలసి పరీక్షా ఏర్పాట్లను పరిశీలించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ  పరీక్ష ఉదయం 11 నుంచి 1 వరకు ఉంటుందన్నారు. విద్యార్థులను గంట   ముందునుంచె పరీక్షా హాల్ లోనికి అనుమతిస్తారన్నారు. . ఎటువంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలను  తీసుకొని  రాకూడదని అన్నారు. ఒక నిముషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి ఉండదన్నారు. పరీక్ష  కు హాజరయ్యే అభ్యర్థులు ఈ సూచనలను గమనించాలన్నారు. 

బెల్లంపల్లి ఏరియాకు బంగారు భవిష్యత్తు ఉంది : ప్లానింగ్ డైరెక్టర్ భాస్కర్ రావు

   
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 20 ; బెల్లంపల్లి సింగరేణి  ఏరియాకు బంగారు భవిష్యత్  ఉందని  ప్రాజెక్ట్ అండ్  ప్లానింగ్ డైరెక్టర్  భాస్కర్ రావు అన్నారు. గురువారం బెల్లంపల్లి ఏరియా రెబ్బెన మండలం  గోలేటి క్రాస్ రోడ్డు వద్ద  తొంభై రెండు కోట్లతో నూతనంగా  నిర్మించిన సి హెచ్ పి    ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై  శిలా ఫలకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ బెల్లంపల్లి ఏరియాలోని ఓపెన్ కాస్టుల ద్వారా బొగ్గు  ఉత్పత్తి గణనీయంగా పెరిగిందన్నారు గతంలో నలభై మిలియన్ల టన్నుల బొగ్గును మాత్రమే బెల్లంపల్లి ఏరియా నుండి ఉత్పత్తి చేసేవారన్నారు. ప్రస్తుతం సంవత్సరానికి డెబ్బై మిలియన్ల ముత్తన్నలు బొగ్గుని ఉత్పత్తి చేస్తున్నారన్నారు సింగరేణి ఏరియాలో ప్రత్యేకంగా బెల్లంపల్లి ఏరియా గుర్తింపు తెచ్చుకుందన్నారు ఏరియా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని  సి హెచ్ పి ని నిర్మించడం జరిగిందన్నారు. ఏరియాలో నూతన గనులు రానున్నాయని బొగ్గు ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకుని సి హెచ్ పి ఏర్పాటు చేసిన్నట్లు పేర్కొన్నారు. సి హెచ్ పి నిర్మాణంతో కాలుష్యాన్ని గణనీయంగా  నివారించడంతో పాటు రోడ్డు మార్గంలో బొగ్గు సరఫరా  సాధ్యమైనంత తగ్గించుకోగలిగామన్నారు వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును సకాలంలో చేరవేయడానికి సి హెచ్ పి ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏరియా జిఎం రవిశంకర్ మాట్లాడుతూ  సి హెచ్ పి ఏర్పాటుతో బొగ్గు రవాణాకు ఎంతో  సులువైన మార్గం అన్నారు ప్రతిరోజు మూడు రేకుల బొగ్గును సరఫరా చేయడానికి తమ వంతు కృషి చేస్తున్నామని  సి హెచ్ పి నిర్మాణానికి సహకరించిన రైతులకు, రెవెన్యూ, రైల్వే అధికారులకు కృతజతలు తెలిపారు 2014 ప్రారంభం కావలసిన  సి హెచ్ పి నిర్మాణం పనులు అనివార్య కారణాల వల్ల 2015 ప్రారంభోత్సవం కావడం జరిగిందని తెలిపారు.  ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి జీఎం  సుభాని,మందమర్రి జీఎం రాఘవులు, రైల్వే ఏవో సురేష్ రెడ్డి ,ప్రాజెక్టు ఆఫీసర్లు కొండయ్య మోహన్ రెడ్డి, శ్రీనివాస్, డిజిఎం పర్సనల్ కిరణ్ డిజిఎం సీఆర్పీ విశ్వనాథ్, టిబిజికెఎస్ ఏరియా ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు ఎంయు ఇంజినీర్ రామారావు, డివై పిఎం రామశాస్త్రి, అసిఫాబాద్ మార్కెట్ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ తదతరులు పాల్గొన్నారు .

వ్యాపారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి ; ఎస్సై శివ కుమార్

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 20 ; వ్యాపారులందరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్సై శివకుమార్   అన్నారు. రెబ్బెన మండలకేంద్రసంలోని   అతిథి గృహ  ఆవరణలో వ్యాపారస్తులకు సి సి కెమెరాల ఉపయోగాలపై  ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మాట్లాడారు.  ఏదైనా సంఘటన జరిగినప్పుడు నేరస్థుల ఆచూకి కనుగొనడం తేలిక అవుతుందని అన్నారు. సిసి కెమరాల్లో ఏర్పాటు చేసి  పోలీసులకు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యాపారులు గోవింద్ అగర్వాల్  ,అనిల్, ప్రకాష్ ,హాషుముఖఃలాల్ , నీరజ్ జైస్వాల్, కృష్ణ, ఆసన్న, రాము,మాతా ప్రసాద్, తదితర  వ్యాపారులు పాల్గొన్నారు.

టాస్క్ ఫోర్స్ దాడిలో గుడుంబా పట్టివేత

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 20 ; రెబ్బెన మండల పులికుంట గ్రామంలో గుడుంబా స్వాధీన పరుచుకున్నట్లు  టాస్క్ ఫోర్స్  సి. ఐ  రాంబాబు  తెలిపారు. గుడుంబా అమ్ముతున్నారనే ఖచ్చితమైన నిఘా  సమాచారం తో టాస్క్ ఫోర్స్  సి. ఐ  రాంబాబు నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు ప్రసాద్, వెంకటేష్  లు తనిఖీ చేయగా ఎరుగటి లస్మయ్య ఇంట్లో అమ్మటానికి సిద్దంగా ఉంచిన 5 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకొని రెబ్బన . పోలీస్ వారికి  తదుపరి విచారణ నిమిత్తం   అప్పగించడం జరిగిందన్నరు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  జిల్లా పరిధిలో  ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా నిర్భయంగా తెలియ పరచవచ్చనీ, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది అని అన్నారు.

Wednesday, 18 April 2018

కాగజ్ నగర్ లో భారీ గుట్కా నిల్వ పట్టివేత

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 18 ;  కాగజ్ నగర్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గ రోడ్డులో భారీ గుట్కా నిల్వలు ఉన్నాయనే ఖచ్చితమైన నిఘా  సమాచారం తో బుధవారం టాస్క్ ఫోర్స్  సి. ఐ  రాంబాబు నేతృత్వంలోనితనిఖీ చేయగా దుర్గ రోడ్డులో రవితేజ కిరణం నిర్వహించే తూడూరి రవీందర్ ఇంట్లోని బెడ్ రూంలో పరుపు కింద బాక్స్ లలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 5,00,000/- విలువగల   గుట్కా స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ నిమిత్తం  కాగజ్ నగర్ టౌన పి.ఎస్. పోలీస్ వారికి  అప్పగించడం జరిగింది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో  ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా నిర్భయంగా తెలియ పరచవచ్చనీ, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది అని అన్నారు.  టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు ప్రసాద్, వెంకటేష్  తదితరులు ఉన్నారు. 

మృగాళ్లకు బలైన ఆసిఫా ఆత్మశాంతికి క్రొవ్వొత్తి ర్యాలీ

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 18 ; జమ్మూ కాశ్మీర్ లో మానవ  మృగాళ్ల వికృత చేష్టకు    బలైన ఆసిఫా ఆత్మకు శాంతి చేకూరాలని బుధవారం రెబ్బెన గ్రామ పంచాయితీ యూత్ ఆధ్వర్యంలో రెబ్బెన గ్రామంలోని యువకులు , గ్రామస్తులు పెద్దఎత్తున క్రొవ్వొత్తి ర్యాలీ  నిర్వహించారు.   ప్రధాన రహదారిపై గవర్నమెంట్ హై స్కూల్ నుంచి రెబ్బెన మండల కార్యాలయం వరకు   ర్యాలీ  నిర్వహించారు.  అనంతరం వారు మాట్లాడుతూ ఇటివంటి సంఘటనలు పునరావృతం కాకుండా దోషులకు త్వరగా శిక్ష విధించేలాగా చట్టాలను మార్చాలని డిమాండ్ చేసారు.   ఈ ర్యాలీ  లో రెబ్బెన సర్పంచ్ పెసర వెంకటమ్మ,  ఉపసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, సింగల్ విండో డైరెక్టర్ మధునయ్య నవీన్ కుమార్ జైస్వాల్, మోడెమ్ చిరంజీవీ  , మోడెమ్సుదర్శన్ గౌడ్,గోగర్ల .ప్రవీణ్ , జాకిర్ ఉస్మాని, షైక్ మన్సూర్ అహ్మద్, షైక్ ఉబైదుల్ల,సయ్యద్  అఫ్రోజ్,జహూర్ షైక్, జాకిర్ చాచా , వినోద్ జైస్వాల్,భార్గవ్,   మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో   పాల్గొన్నారు.

రైలు కిందపడి వ్యక్తి మృతి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 18 ;  రెబ్బెన  మండలం తక్కళ్లపల్లి  రైల్వే గేట్ వద్ద గోలేటి నివాసి  జవ్వాజి  రమేష్,  గుర్తు తెలియని  రైల్ కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు  బెల్లంపల్లి రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ విజయకుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం తక్కళ్లపల్లి గేట్ వద్ద మృతదేహం ఉందన్న సమాచారం మేరకు వచ్చి పరిశీలించగా డౌన్  లైన్ పై మృతదేహం పడి  ఉందని బుధవారం ప్రాధమిక దర్యాప్తులో మృతుడు గోలేటి కి చెందిన జవ్వాజి రమేష్ గ    గుర్తించామన్నారు. మృతునికి భార్య సునీత, బాబు మణికంఠ, పాప లక్కీ ఉన్నట్లు తెలిపారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు 

ఆర్ టి సీ బస్సు కారు ఢీ : ఒకరి మృతి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 18 ; రెబ్బెన మండలం తక్కెళ్ల పల్లి వద్ద బుధవారం ఆర్ టి సి బస్సు కారు   ఢీ  కొన్న ప్రమాదంలో    మంచిర్యాల నివాసి  రాథోడ్ క్రాంతి(24) అక్కడికక్కడే    మృతి చెందినట్లు,   సర్కిల్ ఇన్సపెక్టర్ పురుషోత్తం చారి తెలిపారు.  ఆయన  తెలిపిన వివరాల ప్రకారం మృతుడు మంచిర్యాల గౌతంనగర్ నివాసి అని  కాగజ్ నగర్ లో జరిగిన ఒక ఇంజనీరింగ్ షాప్ ప్రారంభోత్సవానికి   వెళ్లి తిరుగు ప్రయాణంలో తక్కళ్లపల్లి వద్ద మంచిర్యాల నుంచి ఆసిఫాబాద్ వెళ్తున్న ఆర్ టి సి బస్సు నెంబర్  ఏ పి   28 జెడ్ 5477  వీరు ప్రయాణిస్తున్న మారుతి కారు  నెంబర్  ఏ  పి  25 సీ  4000 ఎదురెదురుగా   ధీ కొనడంతో  ప్రమాదం జరిగినట్లు తెలిపారు. గాయపడిన జంజిరాల  రాము అనే వ్యక్తిని   బెల్లంపల్లి ఆసుపత్రికి తరలించామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

సిపిఐ (ఎం) జాతీయసభలను జయప్రదం చేయండి


 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 18 ;  ఏప్రిల్ 22 నుంచి ప్రారంభంకానున్న సిపిఐ (ఎం) జాతీయసభలకు కొమురంభీంఆసిఫాబాద్  జిల్లా  నుండి పెద్దఎత్తున కార్యకర్తలు తరలి వెళ్లాలని జిల్లా ప్రధాన కార్యదర్శి కూసన  రాజన్న పిలుపునిచ్చారు. బుధవారం చలో హైదరాబాద్ పేరిట జరిగిన సమావేశం లో మాట్లాడుతూ రానున్న కాలంలో దేశంలో పెను మార్పులు సంభవించనున్నాయని వాటిలో సిపిఐ (ఎం) పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ జాతీయ మహాసభలు బహుజన ఎజండానే ప్రాతిపదికగా తీసుకుని జరుగుతున్నాయన్నారు. గత పాలకులు ప్రజలకు చేసిందేమి లేదని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సామాన్య ప్రజలపై నోట్లరద్దు, జి ఎస్ టి  వంటి వాటితో తీవ్రమైన భారం మోపిందన్నారు. రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని నాలుగేళ్ళ పాలన తర్వాత కూడా ఆ దిశగా  ఎలాంటి ప్రతిపాదన చేయలేదని అన్నారు.ఈ మహాసభలలో జాతీయ నాయకులు  పాల్గొంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు అల్లూరి లోకేష్ తదితరులుపాల్గొన్నారు .

Tuesday, 17 April 2018

ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణీ స్త్రీలకు పండ్ల పంపిణీ

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 17 ; రెబ్బెన మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో  తెరాస  మహిళా విభాగం నుండి  మంగళవారం గర్భిణీ స్త్రీలకు పండ్ల మరియు మజ్జిగ ప్యాకెట్లు  పంపిణీచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కెసిఆర్ మన ముఖ్యమంత్రి పేరు మీద పండ్ల పంపిణీ చేపడుతున్నట్లు తెలిపారు. పార్టీ కార్యకర్తల తరపు నుంచి ఇలాంటి  కార్యక్రమాలు మరెన్నో చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో మన్య పద్మ, అన్నపూర్ణ అరుణ ఆసుపత్రి సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.

లారీ ఢీకొని వృద్ధుడు దుర్మరణం

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 17 ;    రెబ్బెన మండలంలోని దేవుల గూడ సమీపంలో మంగళవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నంబాల గ్రామానికి చెందిన కాటుక ఎర్రయ్య వయస్సు అరవై సంవత్సరాలు అనే వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. రెబ్బెన ఎస్సై శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఎర్రయ్య సోమవారం తాండూరు మండలంలోని అంకుశం గ్రామంలో బంధువుల దహన సంస్కార కార్యక్రమానికి హాజరై రాత్రి తిరుగు ప్రయాణంలో  దేవుల గూడలో బసచేశాడు మంగళవారం తెల్లవారు జామున తన స్వగ్రామమైన నంబాలకు వెళ్లే క్రమంలో అంతర్రాష్ట్ర రహదారి దాటుతుండగా ఆసిఫాబాద్ నుండి బెల్లంపల్లి వైపు వెళుతున్న లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.డీకొట్టిన లారీ గోలేటి ఎక్స్ రోడ్డు సమీపంలోని సింగరేణి సీఎస్పీ వద్ద వాహనాన్ని నిలిపి డ్రైవర్ పరారయ్యారు .వెంటనే సమాచారం అందుకున్న ఎస్ఐ శివకుమార్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించాడు వెంటనే కుటుంబీకులకు సమాచారం అందించారు.కాగా మృతుడికి భార్య ఇద్దరు కుమారులు ఒక కూతురు ఉన్నారు. ఈ మేరకు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అసిఫాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించామన్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.