క్లోరినేషన్ చేపట్టిన మళ్ళీ పురుగుల నీళ్ళు
రెబ్బెన లోని సబ్ స్టేషన్ వెళ్ళే కాలనీలో క్లోరినేషన్ చేపట్టిన మళ్ళీ పురుగుల నీళ్ళు ఆదివారం నాడు వచ్చినట్లే సోమవారం నాడు కూడా కుళాయిల నుండి మంచి నీటిలో పురుగులు వచ్చాయని కాలనీ వాసులు ఆందోళన చెందడంతో సర్పంచ్ పెసరు వెంకటమ్మ మరియి కార్యదర్శి రవీందర్ పరిశీలించగా అందులో పురుగులు ఉన్నట్లు గమనించారు. క్లోరినేషన్ చేపట్టిన ఇలా పురుగుల నీరు ఎందుకు వచ్చాయని కాలనీవాసులు వారిని నిలదీశారు. వారు మాట్లాడుతూ కాలనీలోని పైపు లైనుని మరమత్తు చేపిస్తామని, ఇలా మురికి నీరు పునరావృతం కాకుండా చూస్తామని అన్నారు. వీరితో పాటు ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, తెరాస తూర్పు జిల్లా అధ్యక్షుడు నవీన్ జైశ్వాల్, కారోబారి తిరుపతి, జంషీద్, రమేష్, గోపి, కిరణ్ , నాగరాజు, అప్పారావు తదీతరులు ఉన్నారు.