పాఠశాల సమస్యలు పరిష్కరించాలి

రెబ్బెన : రెబ్బెన మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కరువయ్యాయని, ఏఐఎస్‌ఎఫ్ మండల అధ్యక్షుడు సాయికిరణ్ గురువారం తహసీల్దార్‌కార్యాలయం వద్ద తహసీల్దార్ రమేష్‌గౌడ్‌కు వినతి పత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ జడ్పీహెచ్‌ఎస్, యూపీఎస్ పాఠశాలలకు ప్రహారీగోడలు లేవని, తాగునీటి సమస్య ఉందన్నారు. ఈ సందర్బంగా రెబ్బెన తహసీల్దార్ రమేష్‌గౌడ్ మాట్లాడుతూ పలు సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని, ప్రహరీగోడలు, తదితర పనులను చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో గోలెటి పట్టణ అధ్యక్షుడు ప్రశాంత్, నాయకులు రవి, సదానంద, అరుణ్‌కుమార్, సాయి, అనిల్, రాజేష్, జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment