రెబ్బెన : గత మూడు రోజులు నుండి విద్యుత్ సరఫరా లేక గ్రామాలు అంధకారంతో మగ్గుతున్నాయి. రాత్రిపూట చిన్నపిల్లలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వర్షకాలం కావడం వల్లా పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో ఉండటం వల్ల మురికి కాలువులల్లో చెత్తాచెదారం పేరుకుపోయి దోమలు విఫరీతంగా ఉన్నాయని ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్ లేకపోవడం వల్ల ఇబ్బందులకు గురౌతున్నామని రెబ్బెన్ మండలంలోని నంబాల,కిష్టాపుర్, జక్కులపల్లి, నారాయణపుర్, గంగాపుర్ గ్రామపంచాయితీల్లో విద్యుత్ సప్లై లేదని ప్రజలు ఆందోళ చెందుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
No comments:
Post a Comment