Saturday, 11 July 2015

పదకొండవ రోజుకు చేరిన గ్రామా పంచాయితీ ఉద్యోగుల సమ్మె



గ్రామా పంచాయితీ ఉద్యోగుల సమ్మె  శనివారానికి రెబ్బెన మండలం లో పదకొండవ రోజుకు  చేరింది.  గ్రామా పంచాయితీ ఉద్యోగ కార్మికుల నిరవధిక సమ్మెకు మద్దతుగా ఏ.ఐ.టీ.యి.సీ. నాయకులు దీక్షలో పొర్లు దండాలు పెడుతూ తమ నిరశన తెలియజేసారు ఏ.ఐ.టీ.యి.సీ.  రెబ్బెన మండల కార్యదర్శి రాయిల్ల నర్సయ్య మరియు సీ.ఐ.టీ.యి. జిల్లా కార్యదర్శి నాగవెల్లి సుధాకర్ మాట్లాడుతూ  గ్రామ  పంచాయితి కార్మికులు తమ కోర్కెలను ప్రస్తుతం గ్రామ పంచాయితీలలో పనిచేస్తున్న అన్ని కేటగిరీల ఉద్యోగ,కార్మికులను పర్మినెంటు చేయాలని కార్మికుల కనీసవేతనం  గ్రామ పంచాయితిలలోని ఖాళీ పోస్టులలో ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందినే నియమించాలని ప్రభుత్వం అర్హులైన వారికి పంచాయితీ కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వం దిగివచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు పరిష్కరించే వరకు నిరవదిక సమ్మె చేపడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామా పంచాయితి జిల్లా ఉపాధ్యక్షుడు బాబాజి, మండల అధ్యక్షుడు జి. ప్రకాష్, డివిజన్ కమిటి సభ్యులు తిరుపతి, మండల ప్రచార కార్యదర్శి రత్నం విటల్, నాయకులు అన్నాజీ .లక్ష్మి రాజమ్మ సత్యనారాయణ భాస్కర్ గ్రామా పంచాయితి కార్మిక సిబ్బంది పాల్గొన్నారు

No comments:

Post a Comment