Sunday, 26 July 2015

కూరగాయలు అమ్ముతూ జీపీ కార్మికుల నిరసన

కూరగాయలు అమ్ముతూ జీపీ కార్మికుల నిరసన



రెబ్బెన : గ్రామ పంచాయతీ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆదివారం నాటికి 26వ రోజుకు చేరుకుంది. కార్మికులు రోజుకో రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా రెబ్బెన లో ఆదివారం కూరగాయలు అమ్ముతూ నిరసనను వ్యక్తం చేశారు. ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులు సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికుల సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు బాబాజీ, మండల అధ్యక్షుడు జి. ప్రకాష్‌, డివిజన్‌ కమిటీ సభ్యుడు డి.తిరుపతి, మండల ప్రచార కార్యదర్శి రత్నం విఠల్‌, కార్మికులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment