Thursday, 30 July 2015

కార్మికుల కష్టాలను గుర్తించాలి-వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్రావ్



రెబ్బెన మండలంలోని గోలేటి టౌన్ షిప్ సింగరేణిలో లో శనివారం నాడు వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్రావ్ పర్యటించారు, అనంతరం ఐ,ఎన్,టీ,యూ,సీ భవనంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు, ఈ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్రావ్ మాట్లాడుతూ సకల జనుల సమ్మె వేతనాల కోసం సంస్థ లాభాల్లో 25% ఇవ్వాలని, వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని, వృత్తి పన్నును రద్దు చేయాలని, ఈ రద్దు గురించి గతం లో కూడా ఎన్నో సార్లు రద్దు చేశారని ఆ విధంగానే ఎప్పుడు కూడా రద్దు చేయాలనీ అన్నారు, ఈ నెల 25న సీఎంకు కలిసి 10 డిమాండ్లతో కూడిన వినతీ పత్రాన్ని ఇస్తానని చెప్పారు. ఈ డిమాండ్లను ఆగష్టు 15 లోగ పరిష్కరించకపోతే ఆగష్టు 17 నుండి దశల వారిగా ఆందోళనలు చేపడుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోఐ,ఎన్ ,టీ,యూ, సీ నాయకులు రాంబాబు,ప్రకాష్ రావు,శ్రీనివాస్,బాలరాజు తదీతరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment