Thursday, 30 July 2015

ఉరి వేసుకుని పారిశుద్ధ్య కార్మికులు నిరసన


                       


మండలంలో పారిశుద్ధ్య కార్మికుల సమ్మెలో భాగంగా గురువారం మండల తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఉరి వేసుకుని నిరసన తెలిపారు. ఈ నిరసనలో మండల ప్రచార కార్యదర్శి రత్నం విఠల్‌ మాట్లాడుతూ.. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేకపోతే ఉరి వేసుకునే పరిస్థితి వస్తుందని కనీస వేతనాలను పెంచాలని అన్నారు. ఈ నిరసనలో మండల అధ్యక్షుడు జి. ప్రకాష్‌, డివిజన్‌ కమిటీ సభ్యుడు తిరుపతి, లక్ష్మి, రాజమ్మ తదితర కార్మికులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment