
రెబ్బెన : మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం మధ్యాహ్న భోజనం ఉడకక పోవడంతో ఉడకని బియ్యం, నీళ్లప ప్పు తో విద్యార్ధులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకొ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్ధి ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు కడతల సాయి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్ధుల కోసం మధ్యాహ్నభోజన పథకాన్ని ప్రవేశపెట్టి విద్యార్ధుల సంఖ్యను పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటే పాఠశాల యజమాన్యం మాత్రం విద్యార్ధులకు ఉడికి ఉడకని ఆహారం పెడుతూ, నీళ్ల పప్పుతో కాలం వెళ్ళదిస్తున్నారన్నారు. దీంతో విద్యార్ధులు అన్నం తినలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు. పాఠశాల ప్రారంభం నుంచి ఇదేవిధంగా జరుగుతుందని పాఠశాల యజమాన్యం ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఇప్పటికైన సంబందిత అధికారులు విద్యార్ధులకు మధ్యహ్న భోజనం సరిగా వడ్డించేలా చూడాలని స్థానిక సర్పంచ్ పెసరు వెంకటమ్మ వచ్చి వి ద్యార్ధుల కు నచ్చజేప్పినారు, ఈ పరిస్థితులకు కారణమైనవారిని తొలగిస్తామన్నారు. ఈ సంఘటన స్థలాన్ని స్థానిక తహసీల్దార్ రమేష్ గౌడ్, ఎంపీడీఓ హలీమ్, ఎంఈఓ మహేశ్వర్ రెడ్డి, ఎంపీ పీ కారనాథమ్, సం జీవ్ కుమార్‌లు పరిశీలించారు.
No comments:
Post a Comment