Monday, 6 July 2015

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో హరిత హారం

                   
                    
రెబ్బెన : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన హరిత హారం రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమంలా తీసుకెళ్లాలని ఆసీఫాబాద్‌ ఎమ్మెల్యే కొవ లక్ష్మి అన్నారు. సోమవారం ఎంపిడీఓ కార్యలయంలో అధికారికంగా ఎంపీపీ కార్నాధం సంజీవ్‌ కుమార్‌ అధ్యక్షత చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరైనారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ఈ రోజు నాటినమొక్కలే రేపటి బావితరాలకు ఫలితాలను ఇస్తాయన్నారు. పర్యావరణాన్ని కాపాడుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షురాలు గొడిసెల రేణుక, తహసీల్దార్‌ రమేష్‌ గౌడ్‌, ఎంపీడీఓ ఎంఏ హలీమ్‌, ఏపీఎం రాజుకుమార్‌, ప్రభుత్వ వైద్యురాలు సరస్వతి, మండలంలొని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితర నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment