Wednesday, 15 July 2015

మొక్కలు నాటండి -పర్యావరణాన్ని కాపాడండి - ఎంపీపీ



రె బ్బెన : ప్రతి ఒక్కరు మొక్కలు నాటితే పర్యావరణాన్ని కాపాడవచ్చునని రెబ్బెన ఎంపీపీ కార్నాదం సంజీవ్‌కుమార్‌, జడ్పీటీసీ బాబురావు అన్నారు. రెబ్బెన మండల కేంద్రంలోని సాయి విద్యాలయం ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో బుధవారం నాడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టిన హరితహార కార్యక్రమంలో భాగంగా ప్రయివేటు పాఠశాలలోమొక్కలు నాటడం అభినందనీయమని అన్నారు. నేటి మొక్కలు రేపటి వృక్షాలుగా మారి వాతావరణ కాలుష్యాన్ని పారద్రోలి ప్రాణవాయువుని ఇచ్చి మనలను కాపాడుతాయని అన్నారు. విద్యార్థులందరు ఒక్కొ మొక్కను నాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన సర్పంచ్‌ వెంకటమ్మ, ఉప సర్పంచ్‌ శ్రీధర్‌ కుమార్‌, పాఠశాల కరస్పాండెంట్‌ సంజీవ్‌కుమార్‌, తెదేపా మండల అధ్యక్షులు సుదర్శన్‌గౌడ్‌, సింగిల్‌ విండో డైరెక్టర్‌ మదనయ్య, తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment