రెబ్బెన కస్తూరిబా గాంధీ బాలికల విద్యలయంలోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అఖిల భారత విద్యార్ధి సమాఖ్య మంగళవారం రెబ్బెన మండల డిప్యూటి తహసిల్దార్ రామ్ మోహన్ రావు కు వినతి పత్రం సమర్పించారు, అ.భా.వి.స. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రవీందర్ మరియు పూదారి సాయి మండల అద్యక్షులు మాట్లాడుతూ కస్తూరిబా గాంధీ బాలికల విద్యలయంకు ప్రహరిగోడ లేకపోవడంతో విద్యార్థినులు రాత్రిపూట భయబ్రాంతులకు గురౌతున్నారు అని వారు తెలిపారు, అదే విధంగా రాత్రి సమయంలో పాటశాల ఆవరణం లో పొలిసు పెట్రోలింగ్ చేపట్టాలని వారు డిమాండ్ చేసారు.
No comments:
Post a Comment