Saturday, 4 July 2015

ఎల్లమ్మ చెరువు గట్టుకింద గీత కార్మికుల హరితహారం


రెబ్బెన : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథ కంలో భాగంగా రెబ్బెనలోని ఎల్లమ్మ చెరువు గ ట్టుకింద శనివారం గీత కార్మికులు హరితహారంలో భాగంగా ఈత మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎంపీపీ సంజీవ్‌ కుమార్‌ మాట్లాడుతూ... ఈత మొక్కలు పర్యావరణాన్ని కాపాడుతాయని, గీత కార్మికులకు జీవనోపాధిని కల్పిస్తుందన్నారు. కార్యక్రమం లో గీత కార్మిక సంఘం తూర్పు జిల్లా ఉపాధ్యక్షులు నవీన్‌ కుమార్‌ జైస్వాల్‌, మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, నాయకులు అశోక్‌, చిరంజీవి గౌడ్‌, సురేందర్‌, శ్రీనివాస్‌లతో పాటు ఎక్సైజ్‌ అధికారులు, గీత కార్మికులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment