Saturday, 25 July 2015

ముప్పు రైతులను ఆదుకోని చెరువు నిర్మాణం చేపట్టాలి




రెబ్బెన: నంబాల,నారాయణ పుర్‌ శివారులో గల మిషన్‌ కాకతీయ పనులు  పకీరుపల్లె చింతలచెరువు కి ంద ముప్పు రైతులను ఆదుకోని చెరువు పనులను చేపట్టాలని శుక్రవారం నంబాల ఎంపీటీసీ కొవ్వూరి శ్రీనివాస్‌ ఆధ్వర ్యంలో  రైతులు తహసీల్దార్‌ రమేష్‌ గౌడ్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ చెరువు నిర్మాణం చేప డితే పది ఎకరాలు సాగుకు వస్తుందని కాని డ భై ఎకరాల సాగు భూమి ముప్పుకు గురౌతుందని మూప్పై మంది రైతులు రోడ్డున పడతారని ఎంపీటీసీ కొవ్వూరు శ్రీనివాస్‌ అన్నారు. ఎంఆర్వో మాట్లాడుతూ సంబంధింత అధికారులతో సర్వే చేపించి కలెక్టర్‌గారికి రీపోర్టు పంపిస్తామని అన్నారు. ఈ వినతి పత్రాన్ని ఎంపీటీసీతో పాటు రైతులు చిట్ల శంకర్‌, జాడి రాజయ్య, పిరిసింగుల శంకరయ్య, బీమయ్య, సత్యనారాయణ, మిగిలిన రైతులంతా కలిసి ఇచ్చారు

No comments:

Post a Comment