రెబె ్బన: మండలంలో పారిశుద్ధ్య, గ్రామ పంచాయతీ కార్మికుల నిరవదిక సమ్మె 27వ రోజుకు చేరిందని మండల ప్రచార కార్యదర్శి రత్నం విఠల్ అన్నారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ... తమ సమస్యలను త్వరగా పరిష్కరించాలని లేని ఎడల నిరవధిక సమ్మెలో అనేక ఆందోళనలు చేపడుతామని అన్నారు. ఈ సమ్మెలో గ్రామ పంచాయతీ జిల్లా ఉపాధ్యక్షులు బాబాజీ, మండల అధ్యక్షులు జి. ప్రకాష్, డివిజన్ కమిటీ సభ్యులు తిరుపతి, నాయకులు అన్నాజీ, సత్యనారాయణ, గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment