Thursday, 23 July 2015

23వ రోజుకు చేరిన జీపీ కార్మికుల సమ్మె,మద్దతు తెలిపిన ఎమ్మార్పీఎస్‌ నాయకులు



రె బ్బెన : పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మె గురువారానికి 23వ రోజుకు చేరింది. ఈ సమ్మెలో పంచాయతీ కార్మికులు ఆవుకు వారి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని స మర్పించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ జిల్లా ఉపాధ్యక్షుడు బాబాజీ, మండల అధ్యక్షుడు జి. ప్రకాశ్‌, డివిజన్‌ కమిటీ సభ్యుడు తిరుపతి, మండల ప్రచార కార్యదర్శి రత్నం విఠల్‌, నాయకులు అన్నాజీ,సత్యనారాయణ, భాస్కర్‌, రాజమ్మ, లక్ష్మి తదితర కార్మికులు పాల్గొన్నారు,
 సమ్మెకు మద్దతుగా ఎమ్మార్పీఎస్‌ ఆదిలాబాద్‌ తూర్పు జిల్లా అధ్యక్షుడు రుద్రరావు రాంచందర్‌ మాదిగా , ఎంహెచ్‌పీ జాతీయ ఉపాధ్యక్షుడు ర జియెందర్‌ , బీసీ నాయకులు ఎస్‌. చంద్రకుమార్‌ అడ్వకేట్‌, పంచాయతీ కార్మికులకు మద్దతు తెలిపారు. వారు మాట్లాడుతూ పంచాయతీకార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారు అన్నారు. సీఎం కేసీఆర్‌ వారిపట్ల చిన్న చూపు చూస్తున్నారని అన్నారు. సమస్యలు తీరే వరకు వారికి మద్దతునిస్తామన్నారు. ఈ కార్యక్రమంలోపంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. 


No comments:

Post a Comment