రెబ్బెన మండలంలోని తహసీల్ధార్ కార్యాలయం ముందు కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారానికి 15వ రోజుకు చేరుకుంది. గ్రామ పంచాయతీ కార్మికులు చీపురులు పట్టుకుని ప్రభుత్వానికి పట్టిన దుమ్మును దులుపుతామని నిరసన తెలియజేశారు. ఏఐవైఎఫ్ మండల అధ్యక్షులు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి నాగవెల్లి సుధాకర్ మరియు మండల ప్రచార కార్యదర్శి రత్నం విటల్ మాట్లాడుతూ... కార్మికుల సమ్మె 15వ రోజుకు చేరిన ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కార్మికులను ఏ మాత్ర పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.ప్రభుత్వం దిగివచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో
గ్రామా పంచాయితి జిల్లా ఉపాధ్యక్షుడు బాబాజి, మండల అధ్యక్షుడు జి. ప్రకాష్, డివిజన్ కమిటి సభ్యులు తిరుపతి, , నాయకులు అన్నాజీ .లక్ష్మి రాజమ్మ సత్యనారాయణ
భాస్కర్ గ్రామా పంచాయితి కార్మిక సిబ్బంది పాల్గొన్నారు
No comments:
Post a Comment