Saturday, 4 July 2015

కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరవదిక సమ్మె


రెబ్బెన: గ్రామ పంచాయతీలో ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నాగవెల్లి సుధాకర్‌ అన్నారు. బుధవారం రె బ్బెన మండలంలోని తసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరవదిక సమ్మెను చేపట్టారు. సుధాకర్‌ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న అన్ని కెటగిరిల కార్మికులను, ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని, గ్రామపంచాయతీ సాధారణ ఆదాయంలో 30 శాతం సిబ్బందికి చెల్లించాలనే నిబంధన ఎత్తేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా పదో పీఆర్సీ 43 ఫిట్‌మెంట్‌తో కనీస వేతనాలు చెల్లించాలని తదితర డిమాండ్లతో సమ్మెను చేపపట్టామన్నారు. ఈ సమ్మె లో కార్మిక సంఘం మండలాధ్యక్షుడు ప్రకాశ్‌, డివిజన్‌ కమిటీ సభ్యులు తిరుపతి, మండల ప్రచార కార్యదర్శి రత్న మిఠల్‌ నాయకులు బాబాజీ, అన్నాజి, సత్యనారాయణ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment