Sunday, 26 July 2015

అక్రమంగా తరలిస్తున్న 32 టేకు దుంగలు స్వాధీనం

అక్రమంగా తరలిస్తున్న 32 టేకు దుంగలు స్వాధీనం

రెబ్బెన : బొగ్గు లారీలో అక్రమంగా తరలిస్తున్న 32 టేకు దుంగలను రెబ్బెన మండల ంలోని గోలేటి శివారులో ఆదివారం స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అదుపులో తీసుకున్నట్లు డీఎఫ్‌వో వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన వి లేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. టేకు దుంగలు అక్రమంగా తరలిస్తున్నట్లు తెలుసుకున్న బీట్‌ అధికారి ఎండీ షరీఫ్‌ అడ్డుకోగా ఆయనపై దాడి చేసి స్మగ్లర్లు పారిపోయారని పేర్కొన్నారు. కలప దొంగలపై నిఘా ఉంచుతామని తెలిపారు. నిందితులను పట్టుకుని వారిపై కేసులు నమోదు చేస్తామని, సింగరేణి వారికి కూడా నోటీసులు పంపిస్తామన్నారు. కలపతో కూడిన బోగ్గు లారీని సీజ్‌ చేశారు. సమావేశంలో ఎఫ్‌ఆర్‌వో హనుమం తరావు, సెక్షన్‌ అధికారి ప్రభాకర్‌రెడ్డి, డీవైఆర్వో కె. శ్రీనివాస్‌, బీట్‌ అధికారులు ఎండీ అజరుద్దీన్‌, లత, రవి పాల్గొన్నారు.

No comments:

Post a Comment