అనగనగా ఒక ఎలుగుబంటి ఉండేది. ఒక శీతాకాలంలో రాత్రి నిద్రపట్టక బయట మంచులో తిరుగుతుంటే దానికొక తాబేలు కనిపించింది .

నుంచి తాబేలు తల పైకెత్తి తనను చూడడం దానికి నచ్చలేదు. 'నత్తనడకదాన ... ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నావ్? అని కాస్త ఎగతాళిగా అదిగింది.
తాబేలుకు కోపం డిప్పదాక అంటింది. 'ఏమిటా వ్యంగ్యం? అని నిలదీసింది. మాటామాటా పెరిగి ఎవరు వేగంగా పరిగెత్తగలరో పోటీ పెట్టుకుందామనుకునే దాకా వచ్చింది. సూర్యుడు క్షితిజరేఖ నుంచి బెత్తెడు దూరం పైకొచ్చాక పరుగు పోటి ప్రారంభించాలని నిర్నయించాలనుకున్నాయి. 'నువ్వు సరస్సు ఒడ్డున పరిగెత్తు. నేను సరస్సు అంచున నీళ్ళలో పరుగేత్తుతాను' అని చెప్పింది తాబేలు . 'సరస్సు నిండా మంచు ఉంది కదా! నువ్వు లోపల పరిగెట్టినట్టు నాకెలా తెలుస్తుంద'ని అడిగింది ఎలుగుబంటి. 'నేను సరస్సు అంచులోని మంచుగడ్డల్ని అక్కడక్కడా విరగొట్టి ఆ ప్రదేశాలలో తల పైకెత్తి చూస్తూ ఉంటాను. దాన్నిబట్టి నువ్వు నమ్మొచ్చు' అని జవాబిచ్చింది తాబేలు. సరేనంది ఎలుగుబంటి.
మర్నాడు అడవిలోని అన్ని జంతువులూ వచ్చాయి ఈ పోటీని చూడ్డానికి ఒడ్డున ఎలుగుబంటి నీళ్ళలో తాబేలు పరుగు ప్రారంబించాయి. తాబేలు తాను విరగ్గొట్టిన మొదటి మంచుగడ్డలో నుంచి తల బయటకి పెట్టి 'ఇదిగో ఇక్కడున్నాను ఎలుగుబంటి' అంది. అప్పటికి ఎలుగుబంటి అంది అప్పటికి ఎలుగుబంటి ఇంకా అక్కడకి చేరుకోలేదు. ఎలుగుబంటి ఆశ్చర్యపోయి వేగం పెంచింది. అయినా రెండోసారి కూడా తాబేలే ముందుంది. చివరిదాకా కూడా ఇలాగే సాగింది ఎలుగుబంటి పూర్తిగా వెనుకబడిపోయింది చివరికి ఘోరంగా ఓడిపోయింది.
ఆ అవమానం వల్లే అది శీతాకాలాలు బయటకి రాకుండా నెలల తరబడి నిద్రపోవడం అలవాటు చేసుకుందట. అది ఏమైతే మనకేంటి కాని ఆ పోటిలో తాబేలు ఎలా గెలిచిందో తెలుసా మీకు!
అన్ని జంతువులూ వెళ్ళిపోయాక ఆ సరస్సులోంచి అచ్చం దానిలాగే ఉండే అనేక తాబేళ్లు బయటికొచ్చాయి. అవన్నీ దాని బంధువులు స్నేహితులు ఎలుగుబంటి గుణపాటం నేర్పించడంలో నాకు సహకరించినందుకు మీకందరికీ కృతజ్ఞతలు అని చెప్పింది తాబేలు.

No comments:
Post a Comment