రెబ్బెన : మండలంలోని గోటేటి టౌన్‌షిప్‌లో సింగరేణి రోడ్డుపై మహిళలు రాస్తారోకో నిర్వహించారు. భగత్‌సింగ్ నగర్‌లో త్రాగునీటి కొరత అధికంగా ఉందని నీటిపంపులు కూడా సరిగా సరి చేయడం లేదని తెదేపా మహిళ జిల్లాధ్యక్షురాలు లక్ష్మీ తెలిపారు. నీటి సమస్యను సంబంధిత అధికారులు వెంటనే తీర్చాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళలు ధర్నా చేయడంతో వాహనాల రాకపోకలు అంతరాయం ఏర్పడింది. సంబంధిత అధికారులు హామీ ఇవ్వడంతో మహిళలు ధర్నాను విరమించుకున్నారు.
No comments:
Post a Comment