Thursday, 25 June 2015

మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి

రెబ్బెన : మండలంలో ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం మండల స్థాయిలో ప్రధాన ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎంఏ అలీమ్‌ మాట్లాడుతూ పాఠశాలకు మంజూరైన మరుగుదొడ్లను ఈ నెల 30 లోపే కట్టించాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితాహారం పథకంలో భాగంగా మొక్కలు నాటాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రమేష్‌గౌడ్‌, ఐసీఐటీ రాంకుమార్‌, ఎంఈఓ మహేశ్వర్‌రెడ్డి తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు

No comments:

Post a Comment