Tuesday, 23 June 2015

వాటర్‌షెడ్‌ పరికరాల పంపిణీ



రెబ్బెన : వాటర్‌ షేడ్‌ పథకంలో భాగంగా శుక్రవారం రెబ్బెన ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎనిమిది ఆయిల్‌ ఇంజన్లు,స్పేర్‌ పం పు ఒకటి పంపిణీ చేశారు. ఇందిరా నగర్‌కు మూడు, రెబ్బెనకు ఒకటి, గంగాపూర్‌కు నాలుగు పంపిణీ చేశారు. ఈ వాటర్‌ షెడ్‌ పథకాన్ని అన్ని గ్రామ పంచాయతీలకు వర్తింప చేయాలని బోలేటి సర్పంచ్‌ తోట లక్ష్మణ్‌ కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారునాథం సంజీవ్‌ కుమార్‌, తహసీల్దార్‌ రమేష్‌ గౌడ్‌, ఎంపీడీఓ ఎంఏ.హలీమ్‌, ఏపీఎం రాజ్‌ కుమార్‌, సహకార సంఘం చైర్మన్‌ రవీందర్‌, వట్టివాగు చైర్మన్‌ పెంటయ్య, రెబ్బెన సర్పంచ్‌ పెసరు వెంకటమ్మ, ఇతర గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment