Sunday, 14 June 2015

ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి



తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎఐటీయూసీ తొలి మహాసభలు మంచిర్యాల పట్టణంలో అక్టోబర్‌ 4, 5, 6 తేదిల్లో నిర్వహించడం జరుగుతుందని ఎఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసురెడ్డి సీతారామయ్య తెలిపారు. రెబ్బెన మండల కేంద్రంలోని గోలేటెల్‌ మహేంద్ర భవనంలో ఆదివారం ఐటీయూసీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేంద్రంలో మోదీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని దీని వ్యతిరేకంగా అక్టోబర్‌ 4న అన్ని కార్మిక సంఘాలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. సింగరేణిలో జరిగిన 45 రోజుల సకల జనుల సమ్మె వేతనాలు అందజేయాలని, లాభంలో 25 శాతం వాటాను కార్మికులకు చెల్లించాలని, సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలను పునరుద్దరించాలని కోరారు. కార్మిక సమస్యలపై చేపట్టే మహసభలకు కార్మికులు పెద్ద సంఖ్యల హజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌. తిరుపతి, మొగిలి, రామారావు తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment