Wednesday, 3 June 2015

నిరూపయోగంగా అంగన్‌వాడీ భవనం


రెబ్బెన : మండలంలోని వంకులం గ్రామంలోని అంగన్‌వాడీ - 1 కేంద్రానికి సంబంధించిన అంగన్‌వాడీ టీచర్‌ విధులకు చాలా రోజులు హాజరు కావడంలేదని, దీనితో కేంద్రం ఆవరణలో చెత్తా, చెదారం, ముళ్లపొదలతో శిథిలావస్థకు చేరుకుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేంద్రంలో 40 మంది వరకు చిన్నారులు ఉన్నారు. బాలింతలకు, గర్భిణీలకు, చిన్నారులకు పంపిణీ చేయాల్సిన సరుకులను ఆమె దుకాణాలకు అమ్ముకుంటున్నారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. దీంతో గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం ఉన్నా తమ పిల్లలు ఇంటికే పరిమితం అవుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు 





No comments:

Post a Comment