Thursday, 4 June 2015

అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలి

రెబ్బన : మండలంలోని నంబాల గ్రామ పంచాయతీలోని పులికుంట శివారులో గోలేటి ఎక్స్‌రోడ్‌ వద్ద గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా సీహెచ్‌పీ అక్రమ నిర్మాణం పనులు జరుగుతున్నవి. 2013 ఫిబ్రవరిలో ప్రారంభం అయినట్లు సీహెచ్‌సీ పనులను గ్రామ సర్పంచ్‌ గజ్జెల సుశీల మరియు గ్రామ ప్రజలు అడ్డుకోగా అప్పుడు విధులు నిర్వహిస్తున్న బెల్లంపల్లి జనరల్‌ మేనేజర్‌ నాగయ్య స్పందిస్తూ తప్పక గ్రామ పంచాయతీ అనుమతి తీసుకుంటామని తెలిపారు. సుమారు 5 నెలల తర్వాత ఆయన బదిలీ అయ్యారు. అతని స్థానంలో జీఎం. రాంనారాయణను అనుమతి తీసుకోమని అడుగగా తీపుకుంటామని మభ్యపెట్టి మహి ళా సర్పంచ్‌ మీద కోర్టు నుంచి కేవీపీ నోటీసులు పంపించారని తెలిపారు. గతంలో కూడా గ్రామ పంచాయతీ నుంచి నోటీసులు పంపించారు. అయినా పనులు ఆపలేదని దీనిపై చర్యలు తీసుకోవాలని ప్ర జలు కోరారు. గ్రామ పంచాయతీ నుంచి అనుమతి తీసుకోవాలని వారికి సర్పంచ్‌ తెలిపారు.

No comments:

Post a Comment