Sunday, 28 June 2015

ఇళ్ల మధ్యలో ఉన్నలెవన్‌ కేవీ కరెంట్‌ లైన్‌ తొలంగించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మీకి వినతి పత్రం


రెబ్బెన : మండలంలోని ఇందిరా కాలనీ సబ్‌స్టేషన్‌ రోడ్డులో 11 కేవీ కరెంట్‌ లైన్‌ ఇళ్ల మధ్య ఉండటం ద్వారా శుక్రవారం తీగలు తెగి ఇంటిమీద పడి భారీ శబ్ధంతో మంటలు చెలరేగాయి. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ ఇళ్ల మధ్యలో ఉన్న ఆ వైర్లను తొలంగించాలని కాలనీవాసులు గ్రామ ప్రజలు ఎమ్మెల్యే కోవ లక్ష్మీకి వినతి పత్రం అందించారు. ఆమె పత్రాన్ని పరిశీలించి విద్యుత్‌ అధికారితో ఫోన్‌లో మాట్లాడి ఎమ్మెల్యే సొంత నిధులతో ఒక నెలలో  వాటిని తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్‌కుమార్‌ జైశ్వాల్, అప్సర్ , బొడ్డు ప్రసాద్‌, జంసీద్‌,గోడిసేలా  వెంకన్నగౌడ్‌, జోహార్‌, గుర్వారెడ్డి తదితర కాలనీవాసులు  పాల్గొన్నారు .

No comments:

Post a Comment