Tuesday, 23 June 2015

విద్యార్థులకు పోలీస్‌ విధులపై అవగాహన


రెబ్బెన : పట్టణంలోని పోలీస్‌ స్టేషన్‌ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ కార్యక్రమంలో భాగంగా జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాల విద్యార్థులకు శుక్రవారం పోలీస్‌ విధులపై అవగాహన కల్పించారు. విధులలో భాగంగా పోలీసులు ఏవిధంగా వ్యవహరిస్తారో, ఆయుధాల ఉపయోగం తదితర అంశాలను విద్యార్థులకు ఎస్సై హనుక్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment