రెబ్బెన : రైతులు సేంద్రీయ ఎరువులు వాడితేనే అధిక దిగుబడులు సాధించవచ్చని మండ ల వ్యవసాయాధికారి మంజుల అన్నారు. మండలంలో కొండపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు అవగాహనా సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడుతూ రసాయనిక ఎరువులు తగ్గించి సేంద్రీయ ఎరువుల నే వాడాలని రైతులు ప్రతి సంవత్సరం పంట మార్పిడి చేయాలని భూసార పరీక్షలు చేయించాలని, విత్తనాలను నాణ్యత చూసి కొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ఏఈఓ మార్క్ మార్కెటింగ్ సూపర్‌వైసర్ ప్రభుచర ణ్, పశువైద్యాధికారి సాగర్, గ్రామ రైతులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment