మహాత్మా గాం దీ జాతీయ గ్రామ ఉపాధి హామీ పని చేస్తున్న క్షేత్ర సహాయకుల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సమ్మె నోటీసులు మంగళవారం మండల ఎంపీడీఓ కార్యాలయంలో తహసీల్దార్ రమేష్‌గౌడ్‌కు అందజేశారు. వారి యొక్క కనీస వేతనాలు రూ. 5,440 నుంచి రూ.15,000 వరకు పెంచాలి. క్షేత్ర సహాయకులకు ఉద్యోగ బధ్రత కల్పిస్తూ పంచాయతీ అసిస్టెంట్ సెక్రటరీలుగా గుర్తించి, 43 శాతం ఫిట్‌మెంట్‌ను కలిగించాలి క్షేత్ర సహాయకులను పర్మినెంట్ చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌కే. రహీమ్, ఉపాధ్యక్షులు డీ. శ్రీనివాస్ కోశాధికారి డీ. గణపతి, కమిటీ సభ్యులు పీ. దేవానంద్, వెంకటేష్, తుకారం త దితర సభ్యులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment