రెబ్బెన : తెలంగాణ ఆవిర్బావ వేడుకల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం మండల కేంద్రంలో ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వద్ద మహిళలు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ పెసర వెంకటమ్మ బోనాల కుండాతో ఊరేగింపూగా వస్తుండగా మహిళలు ఆహ్వనం పలికారు. సంవత్సరానికి వచ్చే పీరీల పండుగను తలపించేలా పీరిలా ఊరేగింపూ నిర్వహించారు. మహిళలు తెలంగాణ తల్లి వేషాదారణలో చూపరులను ఆకట్టుకున్నారు. తెలం గాణ సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడేలా సంబరాలు జరుపుకున్నారు. బోనాలతో బతుక్మమ్మ పాటలు పాడుతూ ఆటలు ఆడారు. జై తెలంగాణ జై జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. చిన్నారులు, మహిళలు అనందోత్సవాల మధ్య తెలంగాణ సంబరాల్లో పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రమేష్‌గౌడ్, ఎంపీడీవో అలీం, ఎపీఎం రాజ్‌కుమార్, చిరంజీవి , అంగన్‌వాడి కార్యకర్తలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
No comments:
Post a Comment