రెబ్బెన : మండలంలోని ఇందిరానగర్ నుంచి లేతనగూడెం రైల్వే గేటు వరకు ఉపాధి హామీ పథకంలో కొనసాగుతున్న మట్టి రోడ్డు పనులను రెబ్బెన ఎంపీడీవో ఎం.ఎ. అలీమ్ గారు శనివారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు పనుల్లో నాణ్యతను పాటించాలని, ఇరువైపుల చెట్లను నాటించాలని ఫీల్డ్ అసిస్టెంట్ తుకారంను ఆదేశించారు. ఆయన వెంట అసిస్టెంట్ తుకారాం, సాక్షర భారత్ కో ఆర్డినేటర్ సాయిబాబ తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment