Monday, 22 June 2015

పారిశుద్ద్యం, పరిశుభ్రతపై అవగాహనా సదస్సు


రెబ్బెన : మండల కార్యాలయంలో పారిశుధ్యం, పరిశుభ్రత మీద అవగాహనా సదస్సు మంగళవారం జరిగిన సభలో మండల తహసీల్దార్‌ రమేష్‌గౌడ్‌ మాట్లాడుతూ మండల సర్పంచ్‌లు, అధికారులు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, టీచర్లు గ్రామంలో ఉన్న ప్రజల మధ్య నిరంతరం తిరుగుతున్న ప్రతి ఒక్క అధికారి పారిశుద్యం మీద అవగాహన వచ్చేలా ప్రజలకు తెలపాలి. మరియు సర్పంచ్‌లు మురికి కాలువ పూడిక తీయించడం వాటర్‌ ట్యాంక్‌లు శుభ్రం చేసి బ్లిdచింగ్‌ చల్లడం ఇతర కార్యక్రమాలు చేయాలన్నారు. అలాగే హరితాహారం కింద ప్రతి ఒక్కరు ప్రతి ఊరులో చెట్లను నాటాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎం పీపీ సంజీవకుమార్‌ జడ్పీటీసీ బాబురావు, మండల సర్పంచ్‌లు, మండల ఎంపీటీసీలు మండల వైద్యాధికారులు అంగన్‌వాడీ కార్యకర్తలు ఆశా వర్కర్లు, ఉపాధ్యాయులు తదితర మండలాధికారులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment