Thursday, 25 June 2015

విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని దిష్టిబొమ్మ దహనం


రెబ్బెన : రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వామపక్ష విద్యార్ధి సంఘం దశల వారి ఆందోళనా కార్యక్రమంలో భాగంగా మండలంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్‌ ఎఫ్‌ నాయకులు మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు కస్తూరి రవి కుమార్‌, గోగర్ల రాజేష్‌, పూదరి సాయి కిరణ్‌, తిరుపతి, మహిపాల్‌ రాజు, సాయి, శివాజీ, టీవీవీ జిల్లా నాయకులు కడతల సాయి, ఆత్రం రవి, పర్వలి సాయి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వినోద్‌ పాల్గొన్నారు. 

No comments:

Post a Comment