రెబ్బన : మండల కేంద్రంలోని నంబాల గ్రామ పంచాయతీలో సర్పంచ్ గజ్జెల సుశీల మరియు సాక్షర భారత్ కోఆర్డినేటర్ గాందార్ల సాయిబాబా హరితహారం పథకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారం పథకాన్ని విజయవంతం చేయాలని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, అలాగే ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment