రెబ్బెన : మండలంలోని నంబాల గ్రామ పంచాయతీలో రోడ్డు పులికుంట గ్రామ శివారులో శుక్రవారం నంబాల సర్పంచ్ సుశీల సీసీరోడ్డు పనులను ప్రారంభించారు. పీఆర్‌జీఎఫ్ నిధుల నుంచి లక్ష రూపాయల వ్యయంతో పనులను ప్రారభించడం జరిగిందని అన్నారు. ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి సీసీ రోడ్డు పనులను వేయడం జరుగుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అలీం, ఎపీఎం రాజ్‌కుమార్, పీఆర్‌ఏఈ జగన్మోహన్ రావ్, ఎంపీటీసీ శ్రీను, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment